హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని! (వీడియో)

మలయాళ సినీ ఇండస్ట్రీలో మంజు వారియర్ అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. కేరళలో ఆమెపై ఉన్న అభిమానం మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే పాలక్కాడ్‌లో మంజు వారియర్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. పాలక్కాడ్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంజు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఓ మహిళా అభిమాని ఒక్కసారిగా ఆమెపైకి వచ్చి, మంజు వారియర్ బుగ్గపై బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఈ ఊహించని పరిణామంతో మంజు వారియర్ ఒక్క క్షణం షాక్‌కు గురయ్యారు.

మండిపడిన యాంకర్.. అభిమాని సమాధానం
అక్కడే ఉన్న ఆ కార్యక్రమ యాంకర్ సదరు మహిళ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు. అభిమానం ఉండొచ్చు కానీ.. ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం సరికాదు. ఓ సెలబ్రిటీ ప్రైవసీని గౌరవించాలంటూ స్టేజ్ పైనే హెచ్చరించారు. అయితే ఆ మహిళా అభిమాని మాత్రం ఏ మాత్రం తగ్గకుండా.. "మంజు అక్క అంటే నాకు ప్రాణం, చా ఇష్టం. ఆ అభిమానంతోనే ముద్దు పెట్టుకున్నాను తప్ప, నా ఉద్దేశం తప్పు కాదు" అంటూ తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

Fan Forcefully Kisses Manju Warrier Viral Video Sparks Debate on Celebrity Privacy Full Details

హుందాగా ప్రవర్తించిన మంజు వారియర్
సాధారణంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు సెలబ్రిటీలు అసహనానికి గురవ్వడం లేదా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది. కానీ మంజు వారియర్ మాత్రం తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఆ ఘటనతో కాస్త ఇబ్బంది పడినా, ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా చిరునవ్వుతోనే పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత కూడా మిగిలిన అభిమానులతో ఓపికగా సెల్ఫీలు దిగి, అందరినీ పలకరించి అక్కడి నుంచి వెళ్లారు. మంజు వారియర్ చూపిన ఈ సహనంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో చర్చ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "అభిమానం అంటే గౌరవించాలి కానీ, ఇలా అసభ్యంగా ప్రవర్తించకూడదు" అని కొందరు అంటుంటే, "మహిళా అభిమానే కదా, అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు" అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీల భద్రత, వారి వ్యక్తిగత స్వేచ్ఛపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+