పబ్లిక్‌గా సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని, తర్వాత ఏం జరిగిందంటే..?

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో కన్నా వ్యక్తిత్వంతోనే ఈ భామ అభిమానుల మనస్సులను కొల్లగొట్టింది.సినిమాల్లో పద్దతిగా కనిపించే సాయి పల్లవి, బయట ప్రపంచంలో అంతకు మించిన పద్దతిగా కనిపిస్తుంటుంది. ఈ కారణంగానే చాలామంది సాయి పల్లవికి అభిమానులుగా మారారు.డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Fan kisses Sai Pallavi in public

తన తొలి తెలుగు సినిమా 'ఫిదా' నుంచి మొన్న వచ్చిన 'విరాటపర్వం' వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.'గార్గి'సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. 'అమరన్'సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.చాలా గ్యాప్ తీసుకుని తెలుగులో నటించింది సాయి పల్లవి. నాగ చైతన్య తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది.తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఓ మహిళా అభిమాని సాయిపల్లవి దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇస్తూ

ఆమె చేతిపై ముద్దు పెట్టారు.దీంతో తెగ సంతోష పడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అటు సాయి పల్లవి సైతం హ్యాపీగానే కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+