సమంత ప్రెగ్నెన్సీ..?... షాక్ అవుతున్న అభిమానులు!

దక్షిణాది బ్యూటీగా ఉన్న సమంత పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తోంది. రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి సినిమాలు చేయనప్పటికీ ఆమె మొదటి స్థానంలో నిలుస్తుండటం విశేషం. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రతి నెలా విడుదల చేస్తున్న జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టి తానే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇటీవలే విడుదలైన వెబ్ సిరీస్ హనీబన్నీ అత్యధిక వీక్షణలు సంపాదించుకుంది. మరో వెబ్ సిరీస్ చేయబోతోంది. తెలుగులో తన సొంత బ్యానరులో మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఏమాయచేశావో సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.

సమంత గర్భిణీగా ఉన్న ఫొటోలు
ఏమాయ చేశావో సినిమా నుంచి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య-సమంత. నాగచైతన్యకు పిల్లలంటే ఇష్టం. ఈ విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడమే వీడిపోవడానికి ఒక కారణమంటారు. ఏదేమైనప్పటికీ విడిపోయారు. నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సమంత గర్భిణీగా ఉన్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు మాతృత్వంలోని మధురిమను ఆస్వాదించాలని ఉందంటూ సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆ ఫొటోలను చూసిన అభిమానులు వాటిని గుర్తుచేసుకుంటున్నారు.

Fans are shocked by Samantha s pregnancy

నిందితులను అరెస్ట్ చేయాలి
వాస్తవానికి ఇవి నిజమైన ఫొటోలు కాదు. ఎవరో ఆకతాయి ఏఐ ఉపయోగించి సమంత గర్బిణీగా ఉన్న ఫొటోను క్రియేట్ చేశాడు. గతంలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఫొటోలను క్రియేట్ చేశారు. నాలుగు రోజుల క్రితం మహ్మద్ షమి, సానియా మీర్జా పెళ్లి జరిగినట్లు, వారిద్దరూ పలుచోట్ల కలిశారంటూ కొన్ని ఫొటోలను ఏఐతో క్రియేట్ చేశారు. సమంత బేబీబంప్ ఫొటోలను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో కూడా సమంత గర్భిణీ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అలాగే మార్ఫింగ్ చేసిన రష్మిక ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఇటువంటివాటిని వెంటనే అరికట్టాలని, సైబర్ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలంటూ సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+