ఈ సినిమాకు సీక్వెల్ రాదు..రాబోదు ..మర్చిపోండి..!

భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం "హరి హర వీరమల్లు". ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే అభిమానుల నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత వెండితెరపై తమ అభిమాన నటుడిని చూసేందుకు ఉత్సాహంగా థియేటర్లకు వచ్చిన అభిమానులకు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది.

సినిమాలోని కంటెంట్ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రధానంగా అత్యంత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కారణంగా అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, చిన్న సినిమాల్లో కూడా కనిపించే క్వాలిటీ VFXను కూడా అందించలేకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన VFXతో వస్తున్న ఈ రోజుల్లో, ఇంతటి భారీ సినిమాకు కనీస స్థాయి నాణ్యత లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచింది. ఈ నాణ్యత లోపం సినిమా వసూళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Film analysts say it will be difficult to make a sequel to Hari Hara Veeramallu

ఈ ప్రతికూలత సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి "హరిహర వీరమల్లు" సుమారు రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని అంచనా. నెట్ కలెక్షన్లు ₹44.20 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కలెక్షన్లు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచినా,రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇది ఆశించిన స్థాయి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఈ సినిమా మొత్తం రూ. 68.16 కోట్ల నికర కలెక్షన్లను (రూ. 111.60 కోట్ల స్థూల) సాధించింది. సినిమా మొత్తం వ్యాపారం రూ. 126 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ రూ. 127.50 కోట్లు. అంటే, బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకా రూ. 59.34 కోట్లు అవసరం. రెండవ వారంలోకి ప్రవేశించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, "హరి హర వీర మల్లు" సినిమా కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని తొలుత నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ ఫలితం చూసిన తర్వాత మేకర్స్ ఆ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే సీక్వెల్ తీస్తానని నిర్మాత చెప్పడం జరిగింది. దీంతో ఈ సినిమా నుంచి సీక్వెల్ రావడం కష్టమనే భావన వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+