చల్లారిన మంటను మళ్లీ రాజేస్తున్న అల్లు అర్జున్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సినీ ప్రియులతోపాటు మెగా అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానుల్లో కూడా రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాల్లోకి ప్రవేశించడానికి, హీరోగా నిలదొక్కుకోవడానికి, స్టార్ హీరోగా మారడానికి చిరంజీవి అనే పేరును అల్లు అర్జున్ పునాదిగా చేసుకున్నాడని, అయితే ఈరోజున ఆ పునాది లేనట్లుగా, తనంతట తానుగా స్టార్ హీరో అయ్యాను అన్నట్లుగా బన్నీ మాటలు ఉంటున్నాయని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ తన అనుకున్నవారి కోసం ఎంతదూరమైనా వస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే.

మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు
ఈ సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయిపోయిన విషయాన్ని అంతటితో వదిలేయాలని, కానీ బన్నీ మాట్లాడిన మాటలు మళ్లీ ఆరిపోయిన వివాదాన్ని తిరిగి రాజేసేలా ఉన్నాయని, జరిగిన విషయానికి వివరణ ఇస్తున్నట్లుగా ఆ మాటలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని, ఇటువంటి సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని హితవు పలుకుతున్నారు.

Film analysts suggest that Allu Arjun should focus only on films

మంచి వాతావరణం ఏర్పడేలా చూడాలి
అంతేకాకుండా అల్లు అర్జున్ కు ఆర్మీ పేరుతో ఉన్న సోషల్ మీడియా సైన్యంద్వారా నెగెటివ్ వార్తలను వ్యాపింపచేస్తుంటారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయని, ఒకవేళ ఇవి నిజమైతే సినీ పరిశ్రమలో స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటువంటి నెగెటివ్ పోస్టులద్వారా చివరకు మనకే చెడ్డపేరు వ్యాపిస్తుందని, బన్నీ తన సైన్యాన్ని నియంత్రించాలని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చూడాలంటున్నారు.

ఎవరిత పని లేదన్నట్లుగా ఉంటున్నాయి
గడిచిపోయిన విషయాలను గుర్తు చేయకూడదని, గతం గతహ అంటారని, వాటిని తవ్వుకోకుండా సినిమాలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలంటున్నారు. చిరు కుటుంబానికి, అల్లు అర్జున్ కు వివాదాలున్నాయని వార్తలు వస్తున్నా ఇంతవరకు చిరంజీవిలాంటి వ్యక్తి ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అల్లు అర్జున్ మాత్రం పరోక్షంగా మాట్లాడుతున్నారని, ఇటువంటివాటిని కట్టిపెట్టాలని సూచిస్తున్నారు. నాకు ఎవరితోను పనిలేదు.. నేను సొంతంగానే ఎదిగాను.. అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+