రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవితేజ సరసన హీరోయిన్లుగా డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించారు. ఈ మూవీని ఎస్‌ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మరి రవితేజ చాలా గ్యాప్ తర్వాత చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎలా ఉందంటే..?
మాస్ మహారాజ రవితేజకు సరైన హిట్ పడి చాలా ఏళ్లు అయింది. 2021 లో క్రాక్ మూవీ తర్వాత ఆయన నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. ధమాకా మూవీ పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వచ్చిన ఐదారు సినిమాలు పరాజయం పొందాయి. దీంతో హిట్ కోసం రవితేజతోపాటుగా ఆయన ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే రవితేజ సినిమాలు సంక్రాంతికి రీలీజై హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణ, మిరపకాయ్, క్రాక్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే ఈ సారి కూడా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
Inside Reports Blockbuster #BMW #BharthaMahashayulakiWignyapthi pic.twitter.com/kXq7wCXhfh
— Epic Media Iview (@EpicMediaIview) January 12, 2026
ఇక ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందనడంలో సందేహం లేదు. రవితేజ తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ మూవీని చేశారు. ఇందులో ఫ్యామిలీస్ కు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రైలర్, పాటలు దుమ్మురేపాయి. ఇన్ సైడ్ టాక్ కూడా బ్లాక్ బస్టర్ అని వినిపిస్తోంది. ఈ క్రమంలో రవితేజ కమ్ బ్యాక్ ఇచ్చినట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినీ సెలబ్రిటీల కోసం ఈ మూవీ స్పెషల్ షో వేసినట్లు సమాచారం. వాళ్లు కూడా మూవీ పెద్ద హిట్ అంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇటు భార్య, అటు ప్రేయసి మధ్య నలిగిపోయో పాత్రలో రవితేజ సూపర్ గా చేశారని తెలుస్తోంది. ఈ మూవీని డైరెక్టర్ కిశోర్ తిరుమల అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఇక ఫుల్ రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications