బాయ్‌కాట్ చేస్తామని చెప్పి బ్లాక్ బాస్టర్ హిట్ చేశారు కదరా..!
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'కాంతార'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, దర్శకత్వం, సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలు ఈ సినిమాకు మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా తెరకెక్కించారు.
'కాంతార ఛాప్టర్ 1' పేరుతో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా.అంచనాలను మించి దూసుకుపోతున్న 'కాంతార ఛాప్టర్ 1' సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ ఊచకోత కోస్తోంది.విడుదలకు ముందు కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రీమియర్‌లతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తోంది.

దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని 'కాంతార అంటే ఏమిటి' అనే ఇతివృత్తంతో అద్భుతంగా తెరకెక్కించారు. స్థానిక సంప్రదాయాలు, పంజుర్లి, భూతకోళ వంటి జానపద అంశాలను పూర్తిగా మేళవించి, ఈ సినిమాను ఒక విజువల్ వండర్గా మలిచాడు. ఇందులో ఏది కంప్యూటర్ గ్రాఫిక్స్ , ఏది నిజం అని నమ్మశక్యం కాని విధంగా తీర్చిదిద్ది, రిషబ్ శెట్టి మేకర్‌గా తన సత్తాను చాటాడు.
ఈ చిత్రం తొలిరోజే దాదాపు ₹89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూకుడు అసాధారణం. నిన్నటితో హిందీలో ₹91 కోట్ల నెట్ వసూళ్లు, ₹102 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రాబోయే వీకెండ్‌లో కూడా బాలీవుడ్‌లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
ఆరు రోజుల్లో దాదాపు ₹400 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆరో రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త నెమ్మదించినా, అన్ని ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి.
ప్రాంతాల వారీగా వసూళ్లు (6 రోజుల్లో):
కర్ణాటకలో: ₹100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో: ₹70 కోట్ల గ్రాస్ వసూళ్లు.
తమిళనాడు, కేరళలో: చెరో ₹30 కోట్ల గ్రాస్ వసూళ్లు.
హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్‌లో: ₹103 కోట్ల గ్రాస్ వసూళ్లు.
ఓవర్సీస్‌లో (విదేశాల్లో): ₹67 కోట్ల గ్రాస్ వసూళ్లు.
ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఇప్పటికే $2 మిలియన్ యూఎస్ డాలర్ల మార్కును దాటి, $3 మిలియన్ డాలర్ల వైపు వేగంగా పరుగులు పెడుతోంది. మరో రికార్డు ఏమిటంటే, బుక్ మై షోలో ఇప్పటి వరకు 7 మిలియన్ టికెట్లు బుక్ అయ్యాయి.
కాంతార' లాంగ్ రన్‌లో హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ జోరు కొనసాగిస్తే, ప్రపంచవ్యాప్తంగా ₹700 కోట్ల గ్రాస్ వసూళ్లను సులభంగా రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే ఈ ఏడాది అతిపెద్ద హిట్‌గా నిలిచిన 'ఛావా' సినిమా వసూళ్లను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications