హ్యాపీ బర్త్ డే 'మాస్ మాహారాజ్'.. 75వ సినిమా గ్లింప్స్ చూశారా..?
కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు.. అనే సూక్తులకు మన రవన్న సరిగ్గా సెట్ అవుతారు. ఆయన జర్నీ ఎంతోమంది యువ నటీనటులకు స్ఫూర్తి. క్యారెక్టర్ ఆర్టిస్టు గా ప్రయాణం మొదలుపెట్టి చిన్నా చితకా వేశాలు వేస్తూ.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మారి అక్కడి నుంచి స్టార్ గా మారారు రవితేజ. ఒంటరిగానే చలనచిత్రసీమలో పోరు మొదలు పెట్టి.. ఎంతో మంది బడా స్టార్స్ ను తట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవన్న. 3 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అపజయాలు.. మరెన్నో విజయాలు. ఇప్పటి వరకు 74 సినిమాలు చేసి.. ప్రస్తుతం 75వ సినిమా మాస్ జాతర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
సింధూరంతో హీరోగా ఎంట్రీ..
అప్పటివరకూ చిన్నచిన్న వేషాలకే పరిమితమైన రవితేజ.. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సింధూరం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. 1997లో విడుదలైన ఈ మూవీతో రవితేజకు హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇడియట్ మూవీ గురించి చెప్పాల్సిన పనిలేదు. రవన్న కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమాల్లో ఇడియట్ ఒకటి. ఈ సినిమాతో అటు యూత్ లోనూ, ఇటు మాస్ ఆడియన్స్ కూ రవితేజను దగ్గర చేసింది ఈ మూవీ.

బోర్ కొట్టని వెంకీ..
మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీ వెంకీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని కామెడీకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ ఇప్పటికీ రీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక రవితేజ మాస్ ఇమేజ్ ను మరింత పెంచిన సినిమాలు భద్ర, విక్రమార్కుడు. ఈ రెండు సినిమాలు కెరీర్ లో బిగ్గెట్స్ హిట్స్ గా నిలిచాయి. ఇక కృష్ణ, నేనింతే, కిక్, దుబాయ్ శీను, పవర్, రాజా ది గ్రేట్, క్రాక్ సినిమాలతోనూ అలరించారు రవితేజ.
రవితేజ 75వ మూవీ మాస్ జాతర..
మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సినిమా 'మాస్ జాతర'. ఈ సినిమాకు బోగవరపు భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్లే ఫుల్ మాస్ అంశాలు ఈ గ్లింప్స్ లో ఉన్నాయి. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే కథ అని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.












Click it and Unblock the Notifications