'ఫంకీ' మూవీ ట్రైలర్ రిలీజ్.. 'జాతి రత్నాలు' కు మించిన కామెడీ..!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'ఫంకీ'.. ఈ మూవీని 'జాతి రత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. హైదరాబాద్ లోని శ్రీ రాములు 70ఎంఎం థియేటర్ లో ఇవాళ సాయంత్రం లాంఛ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ ఫుల్ కామెడీగా ఉంది. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్.. ప్లాఫ్ లతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా 'ఫంకీ' సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ట్రైలర్ ఫుల్ కామెడీగా నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా ఉంది. ఈ మూవీని 'జాతి రత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించాడు.
ఇక ట్రైలర్ లో అనుదీప్ టేకింగ్, విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ నవ్వులు పంచుతోంది. ఆయన డైలాగ్స్ కామెడీగా ఉన్నాయి. లవ్ స్టోరీ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులూ కడుపుబ్బా నవ్వుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఫిబ్రవరి 13 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన కయాడు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే నరేశ్, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.












Click it and Unblock the Notifications