గద్దర్ అవార్డుల మొమెంటో రిలీజ్...
తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఈసారి "గద్దర్ అవార్డులు" పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. రీసెంట్ గానే 2024కు సంబంధించి అవార్డులను అనౌన్స్ చేశారు. అలానే 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు ప్రకటించారు. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా గద్దర్ అవార్డుల జ్ఞాపికను ప్రభుత్వం విడుదల చేసింది. జ్ఞాపికలో చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా ఉంది. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. కాగా గద్దర్ గుర్తుగా డప్పును ముద్రించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా ఈ చిహ్నాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గతంలో నంది అవార్డుల కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. అవార్డుల్లో భాగంగా మొత్తం 73 పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా.. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4.5 కోట్లు ఖర్చు చేయనుందని సమాచారం. ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతోపాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది.
ఈ వేడుకకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక 2024 విజేతల వివరాలను పరిశీలిస్తే..
2024 గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలు..
2024 బెస్ట్ ఫిల్మ్స్ ఇవే..
మొదటి ఉత్తమ చిత్రం: కల్కి 2898ఏడీ
రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్
మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
హిస్టరీ - హెరిటేజ్ చిత్రం: రజాకార్
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్
ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ (రజాకార్)
ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
నటుడు: దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
నటి: అనన్య నాగళ్ల (పొట్టేల్)
దర్శకులు: సుజీత్, సందీప్ (క)
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజు యాదవ్)
స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: 'మన సినిమా ఫస్ట్ రీల్' (రెంటాల జయదేవ్)
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications