గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా?

గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చిన సినిమాలకు అగ్రస్థానంలో అవార్డులు దక్కడంపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతల జాబితా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19న ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. 'రాజు వెడ్స్ రాంబాయి', 'ఛాంపియన్' చిత్రాలు అత్యధిక అవార్డులను గెలుచుకుని సత్తా చాటాయి. అయితే ఉత్తమ నటుడిగా 'తండేల్' చిత్రానికి గాను నాగ చైతన్య, ఉత్తమ నటిగా 'ద గర్ల్‌ఫ్రెండ్' చిత్రానికి రష్మిక మందన్న ఎంపికవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకు ఈ చర్చ?
ఈ అవార్డుల్లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీల్లో ఎంపికైన రెండు సినిమాలు అల్లు అరవింద్ నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌కు చెందినవే కావడం గమనార్హం. గతంలో 'పుష్ప 2' తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్‌కు, తెలంగాణ ప్రభుత్వం (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని) మధ్య చిన్నపాటి అభిప్రాయభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో గీతా ఆర్ట్స్ సినిమాలకే అగ్ర తాంబూలం దక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Gaddar Film Awards 2025 Geetha Arts Dominates Is Allu Aravind Strategy Behind the Wins

దీనిని భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు..
అయితే, చాలామంది నెటిజన్లు దీనిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. భూతద్దం పెట్టి పరీక్షగా చూడాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంటున్నారు. గతేడాది కూడా ఇదే ప్రభుత్వం 'పుష్ప 2' చిత్రానికి గాను అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డును అందించింది. కాబట్టి ప్రభుత్వం ప్రతిభకు ప్రాధాన్యతనిస్తూ అవార్డులు ఇచ్చిందని, ఇందులో రాజకీయాలు లేవని మరికొందరు వాదిస్తున్నారు.

అల్లు అరవింద్ చాణక్యం?
మరోవైపు పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలను అల్లు అరవింద్ తన అనుభవంతో చక్కదిద్దారని, పరిశ్రమ ప్రయోజనాల కోసం ఆయన సఖ్యతతో వ్యవహరిస్తున్నారని కొందరు అభిమానులు ప్రశంసిస్తున్నారు. అల్లు అరవింద్ మంత్రాంగం వల్లే గీతా ఆర్ట్స్ చిత్రాలకు గుర్తింపు దక్కిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అవార్డుల ప్రకటన ఎలా ఉన్నా, ప్రభుత్వం కళాకారులను, ప్రతిభను గౌరవిస్తోందని గద్దర్ అవార్డుల ద్వారా స్పష్టమవుతోంది. విభేదాలు ఏవైనా, సినిమా విజయం, నటుల ప్రతిభే అవార్డులను నిర్ణయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+