మొదలైన 'గామా' హంగామా
ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులను ఆకట్టుకునేలా ప్రతిష్టాత్మక గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA) 5వ ఎడిషన్ ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే నాలుగు ఎడిషన్లు విజయవంతంగా నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమం, ఈసారి మరింత ఘనంగా ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ వేడుకకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో GAMA CEO సౌరబ్ కేసరి మాట్లాడుతూ, తమ ఈవెంట్ కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరుపుతున్నామని తెలిపారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని అబ్బురపరిచేలా ఈవెంట్‌ను డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు.

దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, అవార్డులు నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్ల లాంటివని, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించేలా ఉంటాయని చెప్పారు. దర్శకులు బి. గోపాల్ కూడా ఈసారి వేడుకలు అంతకుమించి ఉంటాయని పేర్కొన్నారు.
ఈ వేడుకలో స్టార్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఊర్వశి రౌతేలా, ఫరియా అబ్దుల్లా వంటి ప్రముఖులు పాల్గొని స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లతో అలరించనున్నారు. అంతేకాకుండా, చంద్రబోస్, రఘు కుంచె సంయుక్తంగా రూపొందించిన GAMA థీమ్ సాంగ్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్, మరియు ప్రముఖ కళాకారుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 24 క్రాఫ్ట్స్‌కు ఈ అవార్డులను అందించనున్నారు.












Click it and Unblock the Notifications