'పుష్ప2' కాదు... అంతకు మించి ప్లాన్ చేస్తున్న 'గేమ్‌ఛేంజర్'

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం పుష్ప2. దీనిపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతోంది. కలెక్షన్లు కూడా భారీగా కొల్లగొడుతుందనే అంచనాలున్నాయి. ఇదే నెల మూడోవారంలో విడుదల కావాల్సిన గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. భారీ చిత్రాలను అలవోకగా నిర్మించే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

మెగా, అల్లు మధ్య భగ్గుమంటోంది
మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందనే విషయం తెలిసిందే. దీనిపై అనేక వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. సోషల్ మీడియాలో మెగా అభిమానుల మధ్య, అల్లు అర్జున్ అభిమానుల మధ్య హోరాహోరీగా యుద్ధం నడుస్తోంది. పుష్ప2ను మించి గేమ్ ఛేంజర్ ను విడుదల చేయడమేకాదు.. దేశవ్యాప్తంగా విస్త్రతంగా ప్రచారం చేపట్టనున్నారు. అందుకు తగ్గట్లుగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దేశవ్యాప్తంగా 11 చోట్ల విడుదల చేస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు శంకర్ కానీ, నిర్మాత్ దిల్ రాజు కానీ అస్సలు తగ్గడంలేదు. ఎందుకంటే పుష్ప2 నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కు, దిల్ రాజుకు పరిశ్రమలో యుద్ధం నడుస్తోంది. తన ఆధిపత్యానికి మైత్రీవార్ చెక్ పెట్టకుండా చూసుకోవడానికి దిల్ రాజు వ్యూహాలు రచిస్తున్నారు.

game changer producer dil raju is planning a massive release beyond Pushpa2

11 థియేటర్లలో నేరుగా టీజర్ విడుదల
నేరుగా 11 చోట్ల థియేటర్లలో టీజర్ ను విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, ఖమ్మం, బెంగళూరు తదితర చోట్ల థియేటర్లలోకి టీజర్ నేరుగా రాబోతోంది. మరో 48 గంటల్లో ఇది విడుదల కాబోతోంది. ఖర్చుకు వెనకాడకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతోపాటు తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీతోపాటు ఓవర్సీస్ లో విడుదల చేయడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. 11,500 థియేటర్లలో పుష్ప2 విడుదలవుతుండగా అంతకుమించిన ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయడానికి దిల్ రాజు ప్రణాళికను సిద్ధం చేసివుంచారు. సినిమా బాగుందనే టాక్ కొంచెం వచ్చినా చాలు రామ్ చరణ్ పెను ప్రభంజనాన్ని సృష్టించే అవకాశం కనపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+