అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్... ఇక నుంచి ఎలా ఉంటుందంటే..!
Geetha Arts: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారారు. పుష్ప2 తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్, ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా లేదంటే త్రివిక్రమ్ సినిమా చేస్తారు. అప్పటికి సుకుమార్ రామ్ చరణ్ తో చేస్తున్న చిత్రం పూర్తయితే పుష్ప3 చేస్తారు. ఇలా చాలా బిజీగా ఉన్న తరుణంలోనే తన తండ్రి అల్లు అరవింద్ స్థాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ పగ్గాలు అందుకున్నారు. ఇకనుంచి తనదైన శైలిలో ముందుకు పరుగులు తీయించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థలో అనేక మార్పులు చేస్తున్నారు.
అల్లు పేరుతో స్టూడియో నిర్మాణం
అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ను 1972లో స్థాపించారు. అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య భగవద్గీత నుంచి స్ఫూర్తి పొంది గీత అనే పేరు పెట్టారు. 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ముందుగా సినిమా నిర్మాణం తర్వాత పంపిణీ రంగంలోకి, థియేటర్ల నిర్వహణ, లీజు, ఫైనాన్స్ తోపాటు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ఈ సంస్థ ప్రవేశించింది. తాజాగా అల్లు పేరుతో స్టూడియో నిర్మాణం జరుగుతోంది. ఈ స్టూడియో నిర్మించడంలో కీలక ఆలోచన అల్లు అర్జున్ దే.

అల్లు అర్జున్ గ్రాండ్ సక్సెస్ చేస్తారు
గీతా ఆర్ట్స్ కు సంబంధించిన ప్రతి కీలక విభాగంలో సమర్థవంతులైన ఉద్యోగులను నియమించుకోవడంలోనే అరవింద్ విజయం దాగివుంది. ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు ఉన్న సీనియర్ ఉద్యోగులతోపాటు కొత్త రక్తాన్ని కూడా ఎక్కిస్తున్నారు. యువతకు అవకాశం కల్పిస్తున్నారు. చిరంజీవి తోడల్లుడి కుమార్తె విద్య కూడా గీతా ఆర్ట్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో సంస్థ సాఫీగా ముందుకు సాగుతోంది. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న అల్లు అరవింద్ వ్యాపార కార్యకలాపాలన్నీ అల్లు అర్జున్ పర్యవేక్షిస్తున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
రోజువారీగా సమీక్ష చేస్తున్నారు. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తన తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, సంస్థను విస్తరించేందుకు, ఇతర రంగాల్లోకి ప్రవేశించేందుకు అల్లు అర్జున్ శక్తివంచన లేకుండా కృషిచేయడంతోపాటు సంస్థను ఆ స్థాయికి తీసుకువెళతాడనే నమ్మకాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications