Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రవితేజకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ఓ అనుకోని షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్మాణంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన మాంగల్య షాపింగ్ మాల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే షాపింగ్ మాల్ ప్రారంభించడంతో అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ART సినిమాస్ ప్రాజెక్ట్‌కు బ్రేక్ ?

ఈ భవనం లోని నాలుగు, ఐదు అంతస్తుల్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మాణం జరుగుతోంది. వీటిని ఏషియన్-రవితేజ (ART) సినిమాస్ పేరిట ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మాల్‌పై సీజ్ ఆర్డర్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశముందని భావిస్తున్నారు.

ghmc-officials-gave-a-shock-to-hero-ravi-teja

ఇప్పటికే మహేష్ బాబు (AMB) మరియు అల్లు అర్జున్ (AA Cinemas)తో కలిసి ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్స్‌లను స్థాపించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రవితేజతో కలిసి ART సినిమాస్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు.

ఇక రవితేజ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన 'మాస్ జాతర' అనే సినిమా చేస్తున్నారు. అలానే మరో కొత్త సినిమాకు కూడా ఆయన కమిట్ అయినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ వ్యవహారంపై రవితేజ కానీ, ఏషియన్ సినిమాస్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. భవనం విషయంలో త్వరలోనే స్పష్టత రావొచ్చని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+