అయ్యగారే నెం. 1.. నవ యువ సామ్రాట్ వచ్చేస్తున్నాడు
అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్.. రెండేళ్ల వయసులోనే 'సిసింద్రీ'చిత్రంతో హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత మనం సినిమా క్లైమాక్స్ లో మెరిసి వర్త్ హీరో మెటిరియల్ అనిపించుకున్నాడు. 2015లో వివి వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' మూవీతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ఏజెంట్ లాంటి చిత్రాలు చేశాడు. కానీ ఏ ఒక్కటీ అక్కినేని రేంజ్ కు చెప్పుకోదగ్గ హిట్ కొట్టలేదు.
దీంతో రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫుల్ కసిమీద దిగాడు ఈ నవ యువ సామ్రాట్. అఖిల్ హిట్ కొడితే చూడాలని అటు అక్కినేని ఫ్యాన్స్ తోపాటు.. సగటు సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈసారి గురి తప్పకూడదంటూ ఫుల్ ప్రిపేర్ అయి రంగంలోకి దిగబోతున్నాడు.

వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో మంచి హిట్ అందుకున్న మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్షన్ లో ఓ చిత్రం ఓకే చేశాడు నిఖిల్. ఏప్రిల్ 8న నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్ మైండ్ లో నుంచి పోవట్లేదు. పిడికిలి బిగబట్టి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అయింది. ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ ఉంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈసారి అఖిల్ ఊరమాస్ గెటప్ తో రఫ్పాడిస్తాడని తెలుస్తోంది.
With all my heart…
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 7, 2025
Presenting it to you all tomorrow.#Akhil6 pic.twitter.com/pi8F9XqNRp
ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. అయ్యగారు ఈసారైనా హిట్ కొట్టేస్తాడో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications