గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ హీరో అంటే భయం.. ఎందుకో తెలుసా ?
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్లు అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అనే చెప్పాలి. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో 'స్పిరిట్'.. సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు.
సాధారణంగా హీరోలు కూడా తమ అభిమాన నటులకు, కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వడం, భయపడడం షరా మామూలే. ప్రభాస్ కి కూడా తన పెదనాన్న కృష్ణంరాజు సహా సీనియర్ హీరోలు అందరికీ చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఓ హీరో కాల్ చేస్తే మాత్రం గజగజ వణికిపోతారట. ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభాస్ కి.. సీనియర్ హీరో మోహన్ బాబు అంటే చాలా భయమట. మోహన్ బాబు ఫోన్ చేస్తేనే ప్రభాస్ వణికిపోతారట. ఓసారి కన్నప్ప మూవీ కోసం మా నాన్న స్వయంగా ప్రభాస్ కి కాల్ చేసి నువ్వు ఈ సినిమాలో కచ్చితంగా నటించాలి అని చెప్పారు. అప్పటికే వణికిపోతున్న ప్రభాస్ ఓకే కచ్చితంగా చేస్తాను అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పారట. అయితే మళ్లీ ఈ విషయాన్ని తనకు కాల్ చేసి చెబుతూ ఏదైనా విషయం ఉంటే నువ్వు నాకు కాల్ చేసి చెప్పు.. కానీ ఆయన దాకా రానివ్వకు అని చెప్పినట్టు మంచు విష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు.
తమకు, కృష్ణంరాజు ఫ్యామిలీకి మంచి బాండింగ్ కొనసాగుతోందని ఆ బండింగ్ వల్లే ప్రభాస్ కి నాన్న అంటే గౌరవంతో కూడిన భయం అని మంచు విష్ణు స్పష్టం చేశారు. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ముఖ్యపాత్రలో నటించారు. ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేస్తున్నట్టు సమాచారం.
అంతే కాకుండా ప్రభాస్, మోహన్‌బాబుని బావా అని పిలుస్తారని అందరికీ తెలిసిన విషయమే. బుజ్జిగాడు సినిమాలో మోహన్‌బాబు హీరోయిన్ త్రిషకి అన్నగా నటించడంతో త్రిష తనకు లవర్ కావడంతో బావ అని పిలుస్తారు ప్రభాస్. దాంతో అప్పటి నుంచి మోహన్ బాబుని బావా అని పిలుస్తున్నారట. మరోవైపు కన్నప్ప సినిమాలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది.












Click it and Unblock the Notifications