Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Grammy Awards 2024 : గ్రామీ అవార్డుల్లో జాకీర్ హుస్సేన్‌కు మూడు అవార్డులు...

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గ్రామీ అవార్డుల (2024) కార్య‌క్ర‌మం అమెరికాలో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఈ గ్రామీ అవార్డుల‌నేవీ మ్యూజిక్‌కు అంద‌జేస్తారు. ఇక ఈ సంవ‌త్స‌రం గ్రామీ అవార్డుల్లో ఇండియ‌న్స్ అద‌ర‌గొట్టేశార‌నే చెప్పుకోవాలి. 66వ గ్రామీ అవార్డుల్లో పాష్తోకి గాను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డుల‌ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మ‌క‌మైన మ్యూజిక్ అవార్డు షోకు స్టార్ సింగ‌ర్ ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టాప్ ఆర్టిస్టులు వేదికపై లైవ్ ఫర్ఫార్మెన్స్ చేశారు.

ఇక‌, ఈ అవార్డుల్లో శంకర్ మహదేవన్ తన బ్యాండ్ శక్తి నుంచి కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' ఆల్బమ్ కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుని శంకర్ మహదేవన్ తో పాటు అతని బ్యాండ్ మెంబర్స్ జాకిర్ హుస్సేన్, జాన్ లాగ్లిన్, సెల్వ గణేష్, గణేష్ రాజగోపాలన్ అందుకోవ‌డం జ‌రిగింది. ఫ్లూట్ ఫ్లేయ‌ర్ రాకేష్ చౌరియా రెండు అవార్డులు గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు కేటగిరీల్లో అనేక సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో ఆల్బమ్స్ ఇందులో పోటీపడ‌డం జ‌రిగింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరి కింద‌ 'పాస్తో' ఆల్బమ్ కి బెలా ఫ్లెక్, ఎడ్గర్ మేయర్, రాకేష్ చౌరాసియా, జాకిర్ హుస్సేన్ గ్రామీ అవార్డు అందుకోవ‌డం జ‌రిగింది. ఇక‌, ఇదే టీం బెస్ట్ కాంటెంపరరీ ఇంస్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరిలో 'యాస్ వుయ్ స్పీక్' ఆల్బమ్ తో మరో గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఒకేసారి ఆరుగురు భార‌తీయులు గ్రామీ అవార్డులను అందుకోవ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. అయితే, గతంలో కూడా జాకిర్ హుస్సేన్ రెండు సార్లు గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.

Grammy Awards 2024: Three awards for Zakir Hussain at Grammy Awards...

ఈ ఏడాది గ్రామీ అవార్డుల‌ విజేతలు..

ఉత్తమ ర్యాప్‌ ఆల్బమ్‌ - మైఖేల్‌ (కిల్లర్‌ మైక్‌)
ఉత్తమ ఆఫ్రికన్‌ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్)
మ్యాజిక్‌ వీడియో - జోనథన్‌ క్లైడ్‌ ఎమ్‌ కూపర్‌ (ఐయామ్‌ ఓన్లీ స్లీపింగ్‌)
గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్రదర్శన - జాకిర్‌ హుస్సేన్‌, బెలా ఫెక్‌ (పష్టో)
గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - శక్తి (దిస్ మూమెంట్‌)
ఉత్తమ బ్లూగ్రాస్ ఆల్బమ్ - మొల్లీ టర్టల్ & గోల్డెన్ హైవే - సిటీ ఆఫ్ గోల్డ్
ఉత్తమ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ - బెలా ఫెక్, జాకిర్ హుస్సేన్, ఎడ్గార్ మెయర్, ఫీచరింగ్ రాకేష్ చౌరాసియా - ఆస్ వీ స్పీక్
ఉత్తమ జాజ్ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ - బిల్లీ చైల్డ్స్ - ద విండ్స్ ఆఫ్ చేంజ్
ఉత్తమ కంట్రీ సోలో ప్రదర్శన క్రిస్ స్టేప్లెటన్ - (వైట్ హార్స్)
ఉత్తమ కంట్రీ సాంగ్ క్రిస్ స్టేప్లెటన్ - (వైట్ హార్స్)
ఉత్తమ కామెడీ ఆల్బమ్ - డేవ్ చాపెల్ - (వాట్స్ ఇన్ ఎ నేమ్)?
ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ - సమ్ లైక్ ఇట్ హాట్
ఉత్తమ రాక్ ఆల్బమ్ - పారామోర్ - దిస్ ఇజ్ వై
ఉత్తమ రాక్ సాంగ్ బాయ్‌జెనియస్ - నాట్ స్ట్రాంగ్ ఎనఫ్
ఉత్తమ మెటల్ ప్రదర్శన - మెటాలికా - 72 సీజన్స్
ఉత్తమ రాక్ ప్రదర్శన బాయ్‌జెనియస్ - నాట్ స్ట్రాంగ్ ఎనఫ్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+