ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్యే బయోపిక్ లో కన్నడ సూపర్ స్టార్- గూస్ బంప్స్ పక్కా
తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే జీవిత చరిత్ర తెరకెక్కబోతోంది. లీడ్ క్యారెక్టర్ లో ఏకంగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యే హోదాలో ఉంటూ కూడా అతి సాధారణ జీవితాన్ని గడిపిన ఆ ఎమ్మెల్యే తనకు స్ఫూర్తినిచ్చారని, అందుకే ఆయన పాత్రలో నటించడానికి అంగీకరించానని చెప్పారు. తెలుగులో ఇదే ఆయనకు పూర్తిస్థాయి తెలుగు సినిమా కానుంది.
ఆ మాజీ ఎమ్మెల్యే మరెవరో కాదు- గుమ్మడి నర్సయ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎం-ఎల్) లిబరేషన్ తరఫున అయిదుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన గడిపిన అతి సాధారణ జీవితం ఇక పాన్-ఇండియాగా తెరకెక్కబోతోంది.

ఈ మూవీ టైటిల్- 'గుమ్మడి నర్సయ్య'. ఆయన పడిన కష్టాలు, గడిపిన అతి సాధారణ జీవితమే ఈ సినిమా మూలకథ. చిత్రీకరణ అంతా దీని చుట్టే తిరుగుతుంది. ఈ మూవీతో కొత్త దర్శకుడు తెలుగుతెరకు పరిచయం కానున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్నాడు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ సైతం విడుదలైంది.
శివ రాజ్‌కుమార్ ఆఫ్ వైట్ కుర్తా పైజామా ధరించి, భుజంపై ఎరుపు శాలువతో దర్శనమిచ్చారు. సీపీఐ (ఎంఎల్) జెండా కట్టిన సైకిల్‌ను పట్టుకుని కనిపించారిందులో. కరునాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గుమ్మడి నర్సయ్య' ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరిస్తున్నామని, ఓఅసాధారణమైన, స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ఇది ఓ శక్తిమంతమైన తొలి అడుగు అని చిత్రం యూనిట్ పేర్కొంది.
దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల దృశ్యాలు, భారత రాజ్యాంగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాధాన్యత ఇచ్చారు. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్‌కుమార్ ను పరిచయం చేశారు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications