Gunde Ninda Gudi Gantalu : సెప్టెంబర్ 8 ఎపిసోడ్.. సంజూకి చుక్కలు చూపించిన బాలు !

ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్‌లో అనూహ్య ట్విస్ట్‌లు, కుటుంబ సభ్యుల మధ్య సీక్రెట్ గేమ్‌లతో ఆడియన్స్ కి మంచిగా కనెక్ట్ అవుతోంది. కాగా సెప్టెంబర్ 8వ తేదీన ప్రసారం కానున్న 505వ ఎపిసోడ్ లో కూడా సంజూ, బాలుల మధ్య ఆసక్తికర ఘటనలు హైలైట్ గా నిలిచాయి.

మీనా-బాలుల వివాహ వార్షికోత్సవం..

మీనా, బాలుల వివాహ వార్షికోత్సవం కావడంతో కుటుంబ సభ్యులంతా హాల్లోకి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుమిత్ర రెండు ఉంగరాలను తెచ్చి 'మీకోసం చేయించాను.. మార్చుకోండి అని చెప్పడంతో ప్రభావతి, మనోజ్, రోహిణి అసూయగా మొహాలు పెడతారు. ఆ తర్వాత మీనా, బాలు ఉంగరాలు మార్చుకుంటారు.

gunde-ninda-gudi-gantalu-september-8th-episode-details

మరోవైపు మౌనిక టీ తీసుకుని పైకి వెళ్తుండగా.. బాలు ఆ కప్పును తీసుకుని 'చెల్లమ్మా, బావగారికి నేను ఇస్తాలే టీ. ఇంటికి వచ్చిన వారికి ఆ మాత్రం మర్యాద చేయలేనా' అంటాడు. ఇంతలో మీనా వచ్చి 'అప్పుడే మీ ఆయనకి టీ ఇచ్చేశావా?' అని అడిగింది. 'లేదు వదినా, బాలు అన్నయ్య తీసుకెళ్ళాడు' అని మౌనిక భయపడుతూ చెప్పింది.

'ఓహో, తను తాగడానికి తీసుకెళ్లాడా?' అని మీనా అనగా, మౌనిక 'లేదు వదినా, ఆయనకు ఇవ్వడానికి వెళ్లాడు' అని చెప్తుంది. 'ఏంటి, తోడేలు దగ్గరకు పులి వెళ్లిందా?' అని కంగారుగా మీనా మౌనికతో పాటు పైకి వెళ్లింది. అప్పటికే బాలు నిద్రపోతున్న సంజూ వేళ్లను టీ కప్పులో పెట్టడంతో.. కాలి అరుచుకుంటూ నిద్ర లేస్తాడు. అంతే కాకుండా బాలు టీని కావాలనే సంజూ మీద పడేలా చేయడంతో ఒళ్ళంతా కాలుతుంది.

బాలు 'అయ్యో బావా, ఏమైంది? కాలిందా? ఎక్కడ కాలింది?' అంటూ నటించాడు. మీనా, మౌనిక, సుశీల పరుగుపరుగున అక్కడికి వచ్చారు. సంజూ నొప్పితో విలవిలలాడుతుండగా, మౌనిక అతనికి స్నానానికి నీళ్లు పెడతానని చెప్పింది. సంజూ ఒప్పుకున్నాడు. అయితే, బాలు స్నానానికి వేడివేడి నీళ్లు పెట్టి అక్కడ కూడా సంజూకి కాలేలా చేస్తాడు.

పిజ్జా ఎఫెక్ట్..

టిఫిన్ చేసేటప్పుడు సంజూ 'పూరీ తినను, పిజ్జా తింటాను' అనడం బాలుకు మరింత కోపాన్ని తెప్పించింది. పిజ్జా ఆర్డర్ రాగానే బాలునే బయటికి వెళ్లి, దానిపై కారంపొడి ఎక్కువగా చల్లి, ఏమీ తెలియనట్లుగా సంజూకి ఇచ్చాడు. సంజూతో పాటు మనోజ్ కూడా దాన్ని తిన్నారు. మనోజ్ కారం అనుకుని పారిపోగా, సంజూ మాత్రం అందరి ఎదురుగా కారం అని ఏడవలేక పైకి వెళ్లి నీళ్లు తాగుతూ నెత్తి కొట్టుకున్నాడు. 'వీడు నన్ను కావాలనే ఏడిపిస్తున్నాడా?' అని సంజూకి అనుమానం రావడం మొదలవుతుంది.

కానీ బాలు ఎక్కడా దొరకలేదు. మీనాకు మాత్రం అసలు విషయం అర్థమైంది. దాంతో, 'మావయ్యా, ఈ మనిషిని కాసేపు మా ఇంటికి తీసుకువెళ్లి వస్తాను. ఇక్కడే ఉంటే మౌనిక భర్తను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు' అని చెప్పింది. సుశీల, సత్యం ఒప్పుకున్నారు. 'వదినా, త్వరగా వచ్చేయండి, ఈవినింగ్ సెలబ్రేషన్ ఉంది' అని రవి గుర్తుచేశాడు. మీనా, బాలు కలిసి పార్వతమ్మ ఇంటికి వెళ్ళారు. అక్కడ బస్తీ వాళ్ళు మీనా, బాలుల బంధం గురించి గొప్పగా పొడుగుతారు. సుమతి 'బావా, నీకు ఈ షర్ట్ చాలా బాగుంది' అంది. 'థాంక్యూ, మా బామ్మ కూడా అదే అంది. ఇంతకీ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు?' అని బాలు నవ్వుతూ అడిగాడు. వెంటనే పార్వతమ్మ 'ఏమో బావా, శివ తీసుకొచ్చాడు' అంది. బాలు ముఖం టక్కున మాడిపోయింది. 'కొంప మునిగిపోయింది అమ్మా' అన్నట్లుగా మీనా పార్వతమ్మ వైపు చూస్తుండగానే ఎపిసోడ్ అయిపోయింది.

కమింగ్ అప్‌..

బాలు మీనాను తీసుకుని ఇంటికి వస్తాడు. అయితే, బాలు ఒంటిపై ఆ షర్ట్ ఉండదు. బనియన్‌తో ఉంటాడు. సత్యం, ప్రభావతి అంతా బిత్తరపోతారు. సంజూ 'ఎవరైనా పెళ్లి రోజు అంటే బట్టలు పెట్టి పంపిస్తారు కదా బావా. మీ అత్తగారు ఏంటి, ఉన్న షర్ట్ పీకి పంపించిందా?' అని వెటకారంగా అంటాడు. ప్రభావతి అయితే 'వీడు షర్ట్ ఎందుకు తీసేసి వచ్చాడో నాకు తెలియాల్సిందే' అని పంతం పట్టినట్లుగా అంటుంది. అసలు ఏం జరిగిందో అని నిజాన్ని బయటికి లాగడానికే ప్రభావతి ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+