Guntur Kaaram: రిలీజ్‌కు ముందే బిగ్ లీక్: వాట్సప్‌లో సర్కులేట్

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం (Guntur Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

Guntur Kaaram first single reportedly leaked

గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేస్తోన్నాయి. మాస్ లుక్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ నటిస్తోన్నారాయన.

షూటింగ్ శరవేగంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గుంటూరు కారం నుంచి ఓ బిగ్ లీక్ బయటికొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సింగిల్‌కు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. వాట్సప్, ఎక్స్, ఫేస్‌బుక్, యుట్యూబ్‌లల్లో ఈ లిరికల్ సింగిల్ హల్‌చల్ చేస్తోంది. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తోంది చొక్కాపై గుండి.. అనే లైన్ వినిపిస్తుంది ఈ ఆడియో లీక్‌లో.

గుంటూరు కారం సింగిల్ త్వరలోనే విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు సూర్యదేవర నాగవంశీ. ఇటీవలే ఆదికేశవ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చారాయన. జనవరి 12వ తేదీన విడుదలవుతుందనీ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ సింగిల్ బయటికి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+