గుంటూరు కారంపై షాకింగ్ అప్‌డేట్ ఇచ్చిన IMDB

Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూరచిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. కోట్లల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

Guntur Kaaram occupied top place in IMDBs most anticipated Indian movies rank

గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేస్తోన్నాయి. మాస్ లుక్స్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారాయన. డాన్స్‌, ఫైట్స్‌లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

గుంటూరు కారం నుంచి కొత్తగా రిలీజ్ అయిన కుర్చీని మడత పెట్టి.. లిరికల్ సాంగ్ దుమ్ము లేపుతోంది. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 24 గంటల్లో కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుందా సాంగ్. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, శ్రీలీలపై ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తోన్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ పాటతో గుమ్మడికాయ కొట్టేస్తారనే ప్రచారం ఉంది.

షూటింగ్ ముగిసిన తరువాత వారం రోజుల పాటు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తారని చెబుతున్నారు. ఆ తరువాత సినిమా ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా గడుపుతారు. జనవరి 6 లేదా 7 తేదీల్లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు నిర్మాతలు.

గుంటూరు కారం సినిమాకు దేశవ్యాప్త గుర్తింపు రావడం విశేషం. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్‌లల్లో నంబర్ 1 ర్యాంక్ లభించింది. ఇండియన్ మూవీస్ డేటా బేస్ (IMDB) దీన్ని ప్రకటించింది. రియల్ టైమ్ పాపులారిటీలో అన్ని సినిమానూ మించిపోయింది. విడుదలకు సిద్ధమైన, సెట్స్‌పై ఉన్న అన్ని సినిమాలతో పోల్చుకుంటే గుంటూరు కారంపైనే ఇంట్రెస్ట్ చూపిస్తోన్నారు సినీ లవర్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+