గుంటూరు కారం ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ తేదీ ఇదే..
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ.. గుంటూరు కారం. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలుత మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు పెరిగాయి. మహేష్ స్టామీనాను చాటాయి.
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చి అతడు, ఖలేజా కంటే కూడా భారీ ఓపెనింగ్స్‌ను రికార్డ్ చేసింది గుంటూరు కారం. మహేష్‌కు మంచి పట్టు ఉన్న నైజాం ఏరియాలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మధ్యకాలంలో విడుదలైన మహేష్ బాబు అన్ని సినిమాలు కూడా ఈ రేంజ్‌లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్నాయి.
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కార్‌వారి పాట.. ఇలా ఆయన నటించిన మూవీలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. వరుసగా అయిదు హిట్ మూవీలతో 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్‌ను దాటిన మొట్టమొదటి హీరోగా రికార్డు సాధించాడు మహేష్ బాబు.

తాజాగా- గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వెలువడింది. ఫిబ్రవరి 9వ తేదీన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల కాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఇదివరకే దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చేనెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమౌతోంది గుంటూరు కారం. ఆ తేదీన మిస్ అయితే- మరుసటి వారం అంటే ఫిబ్రవరి 16వ తేదీన విడుదల అవ్వొచ్చని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం తన తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. అమెజాన్ రైన్ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కబోతోంది మూవీ. దీనికోసం రెండు రోజుల కిందటే జర్మనీకి వెళ్లాడు మహేష్ బాబు. త్వరలో హైదరాబాద్‌కు తిరిగిరానున్నాడు. అనంతరం గుంటూరు కారం ప్రమోషన్స్‌లో పాల్గొంటాడు.
-
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్..! -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం












Click it and Unblock the Notifications