సుడిగాలి సుధీర్ హీరోయిన్‌తో తెలుగు హీరో ఎఫైర్...? భార్యకు విడాకులపై ఓపెన్

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.తాజాగా ఓ హీరో & మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్ రిలేషన్ పెట్టుకుని భార్యకు విడాకులిచ్చారు. హీరో & మ్యూజిక్ డైరెక్టర్ మరెవ్వరో కాదు..జీవీ ప్రకాష్.ఏఆర్ రెహమాన్ మేనల్లుడే జీవీ ప్రకాష్.

ఏఆర్ రెహమాన్ మాదిరిగానే జీవీ ప్రకాష్ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు.వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తెలుగులో డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, షాపింగ్ మాల్, ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట వంటి మొదలగు సినిమాలకు సంగీతం అందించారు. మనోడు హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. తెలుగులో కూడా జీవీ ప్రకాష్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే జీవీ ప్రకాష్ తన భార్యకు విడాకులు ఇచ్చారు.

GV Prakash opens up about his relationship with heroine Divya Bharathi

జీవీ ప్రకాష్ తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. సైంధవి ప్రముఖ సింగర్ అనే విషయం అందరికి తెలిసిందే. 11 ఏళ్ల క్రితం జీవీ ప్రకాష్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.అయితే వీరి విడాకులకు ఓ హీరోయిన్ కారణమని వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరోయిన్ దివ్య భారతి కారణంగానే జీవీ ప్రకాష్ తన భార్య సైంధవికి విడాకులిచ్చారనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరు కలిసి బ్యాచిలర్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరు ఓ రేంజ్‌లో రొమాన్స్ చేశారు. ఘాటు సీన్లతో రెచ్చిపోయి మరీ నటించారు. దీంతో దివ్య భారతితో రిలేషన్ కారణంగానే జీవీ ప్రకాష్ భార్యకు విడాకులిచ్చారనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై
జీవీ ప్రకాష్ వివరణ ఇచ్చారు.

మేము బ్యాచిలర్‌ సినిమా కోసం కలిసి పని చేశాం. అంతమాత్రానికే మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని భావిస్తున్నారు.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.తామిద్దరం స్నేహితులం మాత్రమే. సినిమా షూటింగ్‌ అయ్యాక ఒక్కసారి కూడా కలుసుకోలేదు. మళ్లీ ఇలా ప్రమోషన్స్‌లో మాత్రమే కలుసుకున్నాం అని చెప్పాడు. దీనిపై దివ్య భారతి కూడా రియాక్ట్ అయింది. జీవీ ప్రకాశ్‌ భార్యకు విడాకులివ్వడానికి నేనే కారణమని చాలామంది మెసేజ్‌లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో నన్ను టార్గెట్‌ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ తనతో నాకెలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+