Hanuman: బాక్సాఫీస్ పై కొనసాగుతోన్న హనుమాన్ దండయాత్ర..
బాక్సాఫీస్ పై హనుమాన్ దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోంది. ఈ మూవీ చూసేందుకు చాలా మంది వస్తున్నారు. హనుమాన్ తో పాటే వచ్చిన గుంటూరు కారం ఓటీటీలోకి వస్తే.. హనుమాన్ మాత్రం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. హనుమాన్ సినిమా విడుదలకు ముందు థియేటర్లు దొరకడమే కష్టంగా మారింది. ముఖ్యంగా ఈ మూవీకి హైదరాబాద్ లో చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. పెద్ద సినిమా ఉండడంతో ఈ చిత్రానికి థియేటర్లకు దొరకలేదు.
కానీ సినిమా విడుదలైన తర్వాత క్రమంగా థియేటర్లు పెరిగాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా చేశాడు. ఈ మూవీ భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిస్తోంది. ఈ మూవీ ఎవరు ఊహించన విధంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్లలో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు ఈ చిత్రం భారీ విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సిక్వెల్ తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

30 రోజుల్లో ఏకంగా 300 థియేటర్లలో ఈ మూవీ కొనసాగుతోంది. హనుమాన్ మూవీ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ కలెక్షన్లు సాధించింది. మిగాత భాషల్లో కూడా సొమ్ము బాగానే రాబట్టింది. హిందీలో ఈ మూవీ కలెక్షన్లు రూ.50 కోట్లు దాటింది. బాహుబలి 2 హిందీలో రూ.510 కోట్లు రాబట్టింది. కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆఱ్, రోబో 2.0, సలార్, సాహో, బాహుబాలి 1, పుష్ప, కాంతర సినిమాలు హిందీలో భారీగా కలెక్షన్లు రాబట్టాయి.
హిందీలో హనుమాన్ రెండో వారంలో రూ.16.67 కోట్లు సాధించగా.. మూడో వారంలో రూ.6.47 కోట్లు, నాలుగో వారం రూ.3.68 కోట్లు, ఐదో వారం రూ.1.02 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.50.76 కోట్లు రాబట్టింది. కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications