వారికి 'హనుమాన్' గుణపాఠం!
హనుమాన్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ. తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళం, కన్నడం, హిందీలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాకు పోటీగా ఉన్న సినిమాలను నిర్ధాక్షిణ్యంగా తొక్కుకుంటూ ముందుకు వెళుతోంది. రానున్న రోజుల్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడమే కాదని, కొత్త రికార్డులను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ నీల్ అనే పేరుతో ఒక భారీ డైరెక్టర్ పేరు తెచ్చుకోగా, ప్రశాంత్ వర్మ పేరుతో మరో డైరెక్టర్ జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్నాడంటున్నారు.
హనుమాన్ చిత్రాన్ని తొక్కేస్తున్నారంటూ నెటిజన్లు కొద్దిరోజులుగా సినీ పరిశ్రమలోని పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోలపై మండిపడుతున్నారు. అందుకు కారణం.. ఈ చిత్రానికి పోటీగా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సినిమాలు కూడా విడుదల కావడమే. హీరో, డైరెక్టర్.. ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ వారు తీసిన సబ్జెక్టుమీద నమ్మకంతో సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నారు. రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాకెళ్లాలంటే మొదటగా హనుమాన్ నే ఎంచుకుంటారు.

25 సంవత్సరాల నుంచి పరిశ్రమలో పాతుకుపోయిన దర్శకులు, నిర్మాతలు చిన్న సినిమాలను తొక్కాలని చూస్తే వాళ్లే పెద్ద సినిమాలను తొక్కేస్తారని హనుమాన్ నిరూపిస్తోంది. సినిమాకి హనుమాన్ అనే పేరు పెట్టినందుకు సూపర్ సక్సెస్ సాధించింది. మూడు సినిమాల మధ్య చిన్న సినిమా అని, ఈ సినిమా నలిగిపోతుందంటూ కొందరు సినీ పెద్దలు అహంకారంతో మాట్లాడారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలని, ఎంత పెద్ద సినిమాలనైనా ఓడించవచ్చని హనుమాన్ మరోసారి నిరూపించడమేకాదు.. తరతరాలుగా పరిశ్రమలో పాతుకుపోయిన వివిధ విభాగాలవారందరికీ గుణపాఠం నేర్పించింది.












Click it and Unblock the Notifications