ఆ సినిమా టికెట్ ధర తగ్గింపు

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా విజయపథంలోనే దూసుకుపోతోంది. ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇందులో హనుమాన్ గా ఒక స్టార్ హీరో నటిస్తాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు.

ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. కలెక్షన్లను పెంచాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు హనుమాన్ మూవీ సినిమా టికెట్ ధరలను తగ్గించారు. నైజాం మొత్తంమీద సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.175గా ఉంది. దాన్ని రూ.100 చేశారు. అలాగే మల్టీప్లెక్స్ లో రూ.295గా ఉంది. దాన్ని రూ.150 చేశారు.

Hanuman Movie Tickets Price Discount

ధరలు తగ్గించడంవల్ల కుటుంబ సభ్యులంతా థియేటర్లకు తరలివస్తారని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. హనుమాన్ లో తేజ సజ్జా కథానాయకుడు కాగా, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్ తదితరులు నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తప్పించాలని పరిశ్రమలోని కొందరు పెద్దలు ప్రయత్నించినప్పటికీ తమ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాత, దర్శకులు వెనక్కి తగ్గలేదు. వారి అంచనాలకు తగ్గట్లుగానే సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అంత తక్కువ బడ్జెట్ లో అత్యంత నాణ్యతతో కూడిన గ్రాఫిక్స్ ఇవ్వడంపై సినీ ప్రియులంతా ఆశ్చర్యపోయారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలవడంతో తర్వాత రాబోతున్న జై హనుమాన్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+