Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీరమల్లును ఆడించే బాధ్యత భుజాన వేసుకున్న కూటమి: ఇప్పుడు కదా అసలు మజా..

Hari hara Veera Mallu: పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ.. హరిహర వీరమల్లు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత విడుదలైన మొట్టమొదటి సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఆకాశమంత హైప్ క్రియేట్ అయింది. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ మూవీ.. అంచనాలకు అందుకోవట్లేదు.

పవన్ కల్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా బాక్సాఫీస్ ను రఫ్ఫాడించట్లేదు. ఇదో ఎపిక్ డిజాస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. దీనికి అనుగునంగా కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉంటోన్నాయి. రెండో రోజే ఈ సినిమా ప్రదర్శనను ఎత్తేశారనే ప్రచారం జరుగుతోంది. మూడో రోజు 9.25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. తొలి మూడు రోజుల్లో 64.75 కోట్ల రూపాయలను రాబట్టుకుంది.

Hari Hara Veera Mallu Free show for students

ఈ సినిమా విడుదలకు వారం రోజుల నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది సోషల్ మీడియాలో. జనసేన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం దీనికి కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పోస్టింగులు పడ్డాయి.

గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేసిన వ్యక్తిగత విమర్శలను దృష్టిలో పెట్టుకుని.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తొలి సినిమాను ఫ్లాప్ చేయించారని చెబుతున్నారు.

ఈ పరిణామాల మధ్య- హరిహర వీరమల్లు సినిమాను మళ్లీ పట్టాలెక్కించే బాధ్యతను జనసేన తీసుకున్నట్టే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులందరూ ఈ దిశగా చర్యలు తీసుకుంటోన్నట్లు సమాచారం. సినిమాను సక్సెస్ చేయడానికి తమ సొంత క్యాడర్, పార్టీ శ్రేణులను ఏకతాటి పైకి తీసుకుని రానున్నారు.

ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.. రంగంలోకి దిగారు. నేడు హరిహర వీరమల్లు స్పెషల్ షోను ప్రదర్శించాలని నిర్ణయించారు. దీనికి కొన్ని అర్హతలను సైతం పెట్టారాయన. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే 9, 10, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్పెషల్ ఫ్రీ షో వర్తిస్తుంది.

కోరుకొండలో గల రామకృష్ణ థియేటర్ లో ఈ ఉదయం 10:30 గంటలకు ఉచితంగా హరిహర వీరమల్లు సినిమాను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఓ స్లైడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు పోటీగా జనసేన ఎమ్మెల్యేలే రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Take a Poll

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+