'హరిహర వీరమల్లు' టోటల్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల నష్టమంటే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లో నిరాశ పరిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ డ్రాప్స్‌ను నమోదు చేసింది. 'హరిహర వీరమల్లు' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, వీకెండ్‌లో కొంతవరకు నెట్టుకొచ్చినా, వర్కింగ్ డేస్‌లో మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది.
హరిహర వీరమల్లు' పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రూ.12.75 కోట్లు రాబట్టి మంచి శుభారంభాన్నిచ్చింది. ఫస్ట్ డే నాడు రూ.34.75 కోట్లు వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, మూడో రోజున రూ.9.15 కోట్లు, నాలుగో రోజున రూ.10.6 కోట్లు వసూలయ్యాయి.

వీకెండ్ వరకు కొంత పర్వాలేదనిపించినా, వర్కింగ్ డేస్‌లో సినిమా కలెక్షన్లు ఊహించని విధంగా పడిపోయాయి. ఐదో రోజైన సోమవారం కేవలం రూ.2.1 కోట్ల నెట్ మాత్రమే రాబట్టగలిగింది. ఆరో రోజుకు వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారింది. ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.80 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇక 9వ రోజున కేవలం 6 వేల లోపే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 17 లక్షల రేంజ్ లో షేర్ మార్క్‌ని అందుకుంది ఈ సినిమా.
తాజాగా ఈ సినిమా రెండు వారాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమా 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 68.92 కోట్ల షేర్ (రూ. 113.30 కోట్ల గ్రాస్) సాధించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమా రూ. 57.58 కోట్ల షేర్ సాధించి, మిగిలిన ప్రాంతాల్లో రూ. 11.34 కోట్ల షేర్ వసూలు చేసింది.
నిజాం: రూ. 19.23 కోట్లు
సీడెడ్: రూ. 8.09 కోట్లు
ఆంధ్ర: రూ. 34.26 కోట్లు (ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల నుండి)
కర్ణాటక + ఇతర రాష్ట్రాలు (ROI): రూ. 5.02 కోట్లు
ఓవర్సీస్: రూ. 6.32 కోట్లు
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 127.5 కోట్లు కాగా, ఇప్పటివరకు సాధించిన కలెక్షన్ల ప్రకారం ఇంకా రూ. 58.58 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మిగిలిన రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టాలి.












Click it and Unblock the Notifications