ఇకనైనా గట్టెక్కేనా.. తగ్గిన హరిహర వీరమల్లు టికెట్ రేట్లు !
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటస్ట్ మూవీ "హరిహర వీరమల్లు". దాదాపు 13 సార్లు వాయిదా పడడం.. 2023 తర్వాత కొంచెం గ్యాప్ తో సినిమా చేయడం.. అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ ప్రమోషన్స్ చేయడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
ఈ మూవీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిని అందుకోవడంలో కొంచెం వెనుకబడిందనే చెప్పాలి. సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ అభిమానులను నిరాశపరిచింది. కంటెంట్ కాస్త అటుఇటుగా ఉన్నా.. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంలో ఈ తరహా VFXను ఏంటని విమర్శలు వస్తున్నాయి. దాంతో మూవీ టీమ్ కూడా పలు సీన్స్ కట్ చేసింది.

అయితే ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు కొంచెం ఇవ్వండి పడ్డా మరో విషయం టికెట్ రేట్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. మూవీ టికెట్ రేట్లపై కొంత నెగెటివిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం రేట్లు తగ్గించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈరోజు (జూలై 28, 2025) నుంచి టికెట్లు రేట్లు తగ్గిస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభించనున్నాయి. ఈ విధంగా అయినాయి మూవీని మరింత మంది చూస్తారని మూవీ టీమ్ భావిస్తోంది. దీంతో మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ రాజు ఔరంగ జేబుగా కనిపించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు కలిపి ఈ సినిమా మొదటి రోజు 70 కోట్ల గ్రాస్, 32.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. పవన్ కెరీర్‌లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటివరకు రావడం ఇదే తొలిసారి. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ పడిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications