"హరిహర వీరమల్లు" యూఎస్ రివ్యూ..టాక్ ఎలా ఉందంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. వారి ఆశలను మరింత పెంచుతూ, 'హరి హర వీరమల్లు' సినిమా మరో 24 గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చారిత్రక యాక్షన్ చిత్రం గురువారం అధికారికంగా విడుదల కానుండగా, అభిమానుల కోలాహలం మధ్య బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇప్పటికే యూఎస్‌లో కొన్నిచోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ప్రారంభమైన మొదటి 15 నిమిషాలకే ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమైపోతారట. మొదట భారతదేశ చరిత్రతో సినిమా మొదలవుతుందట.దాదాపు 20 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రేమకథతో పాటు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చెబుతున్నారు.
సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే ఫైట్ ఉంటుందని అంటున్నారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందట. ఇక సెకండాఫ్‌లో రెండు యాక్షన్ ఎపిసోడ్‌లు బాగుంటాయని, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని టాక్.
మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్‌లు, పొలిటికల్ సెటైర్లు, మరియు సనాతన ధర్మం గురించి వచ్చే డైలాగులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు నచ్చే విధంగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా సినిమాపై పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications