పవన్‌కు అందనంత ఎత్తులో అల్లు అర్జున్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కథ, దర్శకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, సినిమాలోని కోర్ ఎమోషన్ సరిగా ప్రజెంట్ చేయలేదని, సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ చెందుతున్నారు.
క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్ పుట్‌పై ప్రభావం చూపింది. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వస్తున్నాయి.అయితే, ఈ విమర్శల మధ్య పవన్ కళ్యాణ్ నటన, ఆయన స్వాగ్, యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన నైపుణ్యం సినిమాకు ప్లస్‌గా నిలిచిందని అంటున్నారు.

మొత్తంగా, "హరిహర వీరమల్లు" ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే అభిప్రాయం బలంగా ఉంది.ఇక దీని ప్రభావం కలెక్షన్లపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. "హరిహర వీరమల్లు" సినిమాతో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 రికార్డులను బద్దలు కోడతామని మెగా అభిమానులు సవాల్ విసిరారు. అయితే ప్రీమియర్స్‌కు "హరిహర వీరమల్లు" కంటే పుష్ప-2 సినిమానే ఎక్కువ కలెక్షన్లు సాధించింది.
ప్రీమియర్ వసూళ్ల విషయంలో అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్" తన అగ్రస్థానాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" భారీ ప్రయత్నం చేసినప్పటికీ, "పుష్ప 2" రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమైంది.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన "పుష్ప 2: ది రూల్" చిత్రానికి ముందు రోజు డిసెంబర్ 4 రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు యూకే, యూఎస్ వంటి పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఇండియా వైడ్‌గా 640 షోల ద్వారా ఏకంగా రూ. 14.44 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇందులో రూ. 13.03 కోట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే వచ్చాయి. ఇది "పుష్ప 2"కు ఉన్న భారీ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.
జూలై 24న విడుదలైన పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రానికి ముందు రోజు జూలై 23న తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఇండియా వైడ్‌గా 737 షోల ద్వారా రూ. 12.93 కోట్ల వసూళ్లను సాధించింది. ఇందులో రూ. 12.13 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ కింద వచ్చాయి. "పుష్ప 2" ప్రీమియర్స్ రికార్డును బద్దలు కొట్టేంత దగ్గరగా వచ్చి, చివరి నిమిషంలో హరిహర వీరమల్లు ఆ అవకాశాన్ని కోల్పోయింది.దీంతో, ప్రీమియర్స్ వసూళ్ల పరంగా "పుష్ప 2" తన టాప్ ప్లేస్‌ను పటిష్టంగా నిలబెట్టుకుంది.












Click it and Unblock the Notifications