హరీష్ శంకర్, సిప్లిగంజ్ కు రేవంత్ బిగ్ న్యూస్..!!
తెలంగాణ ప్రభుత్వం యువ సినీ నిర్మాతల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGFDC) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికోసం ప్రభుత్వం 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భరిస్తుంది. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సినిమా రంగంలోని ప్రముఖులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెెందిన దర్శకులు, సంగీత, గాయక, రచన వంటి వివిధ రంగాల నుంచి నిపుణులను ఎంపిక చేశారు. సంతోషం ఫేమ్ దర్శకుడు దశరథ్.. ఈ కమిటీకి ఛైర్మన్ గా నియమితులయ్యారు. మరో ఇద్దరు దర్శకులు సభ్యులుగా ఉన్నారు.

ఈ అవార్డుల కోసం యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు అయ్యాయి. ఈ ఎంట్రీలన్నింటినీ కూడా దశరథ్ సారథ్యంలోని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తుంది. ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలకు అనుగుణంగా ఎంట్రీల పరిశీలన ఉంటుంది. అనంతరం దీన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. అనంతరం అవార్డుల కోసం ఎంపికైన యంగ్ ఫిల్మ్ మేకర్స్ జాబితాను విడుదల చేస్తుంది.
దశరథ్ - ఛైర్మన్
హరీష్ శంకర్- దర్శకుడు
బలగం వేణు- నటుడు దర్శకుడు
పీజీ విందా- సినిమాటోగ్రాఫర్
రాహుల్ సిప్లిగంజ్- గాయకుడు
చరణ్ అర్జున్ - గాయకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత
ఐ లక్ష్మి- రచయిత్రి, సినీ నిర్మాత.. సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ కమిటీకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వమించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించింది.












Click it and Unblock the Notifications