తెలుగులో నెం.1 హీరో అతనే

దేశంలోని ఏ ఇతర భాషల్లో లేనంత స్టార్ హీరోలు మన తెలుగులోనే ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పుడు సహజంగానే ఎవరు నెంబర్ వన్ హీరో అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, రవితేజ, రామ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలున్నాయి. వీరిలో ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరో అయిపోయారు. తనను పాన్ ఇండియా హీరోగానే చూస్తున్నారుకానీ తెలుగు హీరోగా ఎవరూ చూడటంలేదు. ప్రస్తుతం పాన్ ఇండియాలో స్థాయిలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నారు. ముగ్గురు ఖాన్ లను వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని మన డార్లింగ్ ఆక్రమించారు.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కు కూడా క్రేజ్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. వారు పాన్ ఇండియా సినిమాల జోలికి వెళ్లడంలేదు. మహేష్ బాబు మాత్రం రాజమౌళి సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను తెలుగుకు పరిమితమవుతారా? హాలీవుడ్ లో సినిమాలు తీస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఫలితాన్నిబట్టి ప్రిన్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఒప్పుకున్న సినిమాలనే పూర్తిచేసే పరిస్థితి లేదు.

he is the number one hero in telugu film industry

తర్వాత సినిమాలు చేసే పరిస్థితి లేదు
హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తిచేసి ఆయన సినిమాలో మానేసే యోచనలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నేరుగా హిందీ సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ ను అక్కడ పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. పుష్ప2తో వచ్చిన మార్కెట్ ను పదిలపరుచుకోవాలని, అందుకు అనుగుణంగా సినిమా కథలను ఎంచుకుంటున్నారు. యువ హీరోలుగా కాకుండా తెలుగులో అగ్ర కథానాయకులుగా నాలుగు దశాబ్దాల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చెలామణి అవుతున్నారు.

అయితే సినీ విశ్లేషకులు వారిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం యువ హీరోలను పరిగణనలోకి మాత్రమే తీసుకొని చెప్పారు. అచ్చంగా తెలుగు సినిమాలు చేస్తూ కేవలం తెలుగు హీరోగానే ఇప్పటివరకు చెలామణి అవుతున్న మహేష్ బాబే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ హీరో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు పాన్ ఇండియావైడ్ గా ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ ఒప్పుకోకుండా కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. మహేష్ బాబు నెంబర్ వన్ హీరో అనడంపై అతని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+