చిరంజీవి కంటే ముందు మెగాస్టార్ ఆ హీరోనే, కుట్ర పన్నడంతో
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు...వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా చిరంజీవి నిలిచారు.ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత నెంబర్ స్థానం కోసం చాలామంది హీరోలు పోటీ పడ్డారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు నెంబర్ స్థానం కోసం పోటీ పడ్డారు. అయితే వీరిందరి కంటే ముందే మరో హీరో నెంబన్ వన్ స్థానం కర్చీఫ్ వేశారు. ఆయన మరెవరో కాదు సుమన్.నటుడు సుమన్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు.

ఈ తరం వారికి సుమన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో సుమన్ క్రేజ్ మరో లేవల్లో ఉండేది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల కంటే ముందుగానే సుమన్ హీరోగా స్టార్ స్టేటస్ పొందారు. ఎన్టీఆర్,ఏఎన్ఆర్, కృష్ణల తర్వాత తరంలో అందరికంటే సుమన్‌కే క్రేజ్ ఎక్కువగా ఉండేది.అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ అన్నీ పుష్కలంగా ఉన్న నటుడు సుమన్.దీంతో దర్శక, నిర్మాతలు సుమన్‌తో సినిమాలు చేయడానికి పోటీ పడేవారు.
అలాంటి సుమన్ ఎవరూ ఊహించని విధంగా బ్లూ ఫిలిం కేసులో అరెస్ట్ అయ్యారు. సుమన్ అరెస్ట్ కావడంతో ఆయన అవకాశలన్నీ చిరంజీవికి దక్కాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు.అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఉన్నారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.ఈ ఆరోపణలను సుమన్ ఖండించారు. తన అరెస్ట్‌కు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని సుమన్ తెలిపారు. తన స్నేహితుడు దివాకర్ అనే వ్యక్తి వల్లే తాను అరెస్ట్ అయ్యానని సుమన్ చెప్పుకొచ్చారు. ఇందులో సినిమా వారికి , బయట వ్యక్తులకు సంబంధం లేదని ఓ ఇంటర్య్వలో వెల్లడించారు.ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications