నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..!
మరోసారి నటి హేమ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో డ్రగ్స్ కేసులో నటి హేమకు బెంగళూరు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొండాపూర్ లోని క్వాక్ ఏరీనా పబ్ లో నటి హేమ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ఇన్ స్టాలో సంచలన వీడియో పోస్ట్ చేశారు. "మళ్లీ పబ్ కు వచ్చాను.. డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చిందంటూ హేమ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏప్రిల్ 2 న రాత్రి క్వాక్ ఏరీనా పబ్ కు వెళ్లిన హేమ.. పబ్ ప్రాంగణం నుంచే వీడియో రిలీజ్ చేశారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కొండాపూర్ లోని క్వాక్ ఏరీనా పబ్ పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు కలిసి మెరుపు దాడులు చేపట్టారు. పబ్ లో దాదాపు 64 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే వీరిలో వీరిలో ఆరుగురు గంజాయి సేవించినట్లుగా, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

అయితే ఈ పబ్ లో పార్టీకి హాజరైన నటి హేమ.. మళ్లీ పబ్ కు వచ్చాను.. ఇప్పుడే ఈగల్ టీం వాళ్లు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది.. అని తన రిపోర్టును చూపిస్తూ వీడియో షేర్ చేశారు హేమ. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు.. అనవసరంగా నాపై దుష్ప్రచారం చేయవద్దు.. రేపు మళ్లీ టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తానంటూ వీడియోలో పేర్కొన్నారు హేమ. ప్రస్తుతం హేమ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ క్వాక్ ఏరీనా పబ్ లో పట్టుబడిన అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
-
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications