ఐశ్వర్యంలో దక్షిణాదిలో నెం.1 స్టార్ హీరో
దేశంలో అత్యంత ఐశ్వర్యవంతుడైన హీరో ఎవరంటే షారుక్ ఖాన్ అనే పేరును అందరూ చెబుతారు. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం అత్యంత ఐశ్వర్యవంతుడైన హీరో చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్.. వీరెవరూ కాదు.. అక్కినేని నాగార్జున. సినిమాలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆయన ఎక్కువగా దృష్టిసారించారు. సినిమాలద్వారా వచ్చే ఆదాయంకన్నా ఇతరత్రా వ్యాపారాలద్వారా వచ్చే ఆదాయమే ఆయనకు ఎక్కువ. ఒక నివేదిక ప్రకారం సంవత్సరానికి నాగార్జున ఆదాయం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.
నికర విలువ రూ.3600 కోట్లు
ప్రస్తుతానికి నాగార్జున నికర ఆస్తుల విలువ రూ.3600 కోట్లుగా ఉంటుంది. నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ స్టూడియో విలువ దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల మధ్యలో ఉంటుంది. హైదరాబాద్ లో తాను నివసించే ఇంటి విలువ రూ.50 కోట్లుగా ఉంది. ఫామ్ హౌస్ లు, స్థలాలు, రెస్టారెంట్లు, కన్ స్ట్రక్సన్స్, విదేశాల్లో హోటల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఇంటిదగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి ఏ7, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ క్లాస్3 లాంటి ఖరీదైన కార్లు నాగార్జున గ్యారేజ్ లో ఉన్నాయి.

ఖరీదైన కాంప్లెక్స్ లు
అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం పడగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తం పదిన్నర ఎకరాల్లో ఉండగా చెరువును ఆక్రమించారంటూ మూడున్నర ఎకరాల్లో దీన్ని పడగొట్టారు. అంతేకాకుండా పబ్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఖరీదైన రెస్టారెంట్లను నడుపుతున్నారు. వాటి నుంచి అసాధారణ రీతిలో ఆదాయం ఉంటోంది. అంతేకాకుండా సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటారు. ఇండియన్ బ్యడ్మింటన్ లీగ్ లో ముంబయి మాస్టర్స్ టీంను సొంతం చేసుకున్నారు. నాగార్జున దగ్గర ఉన్న గాడ్జెట్స్, స్పోర్ట్స్ గూడ్స్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది.












Click it and Unblock the Notifications