బాలకృష్ణ హీరోయిన్లను వేధిస్తారా..? మొన్న రాధిక ఆప్టే.. నిన్న విచిత్ర
టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ ఆగ్ర హీరో బాలకృష్ణకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను అభిమానించే వారున్నారు. అయితే గత మూడు రోజులుగా బాలకృష్ణకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తమిళ నటి విచిత్ర ఓ ప్రముఖ తెలుగు హీరో తనని వేధించాడని చెప్పి సంచలనం సృష్టించింది.
తన కెరీర్ స్టార్టింగ్‌లో ఓ తెలుగు సినిమాలో నటించానని..ఆ సినిమాలోని హీరో తనని వేధించినట్లు విచిత్ర వెల్లడించింది.సినిమా షూటింగ్‌లో భాగంగా తాము కేరళ వెళ్లగా..అక్కడ హీరోతో తనకి పరిచియం అయిందని..తాను ఎవరో కూడా తెలియకుండానే రాత్రి నా రూమ్‌కి వచ్చేయ్ అన్నాడని ఆమె తెలిపింది. కాని నేను అలా చేయలేదని...దీంతో షూటింగ్ సమయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారని..ఆ హీరో రోజూ తాగొచ్చి నా రూమ్ డోర్ కొట్టేవాడని.. నేను భయపడిపోయే దాన్ని అని నటి విచిత్ర వెల్లడించింది.

ఒకరోజు షూటింగ్‌లో తనని ఆ హీరో అసభ్యంగా తాకాడని..మొదట పొరపాటున జరిగిందేమో అనుకున్నానని..కాని అతడు పదే పదే ఆ విధంగానే చేశాడని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చింది.హీరోపై ఫిర్యాదు చేసిన ఎవరూ కూడా పట్టించుకోలేదని..ఈ సంఘటన ఇంతటితో మర్చిపోవాలని కొందరు తనకి సూచించారని ఆమె తెలపడం జరిగింది. క్యాస్టింగ్ కౌచ్ వల్లే తాను సినిమాలకు దూరం అయ్యానని నటి విచిత్ర వెల్లడించింది.
ఇది బాలకృష్ణ నీచమైన బుద్ది...💦💦💦😡😡
— Radhika (Leo)🦁 (@sweety_00099) November 22, 2023
బాలకృష్ణ పై సంచలన ఆరోపణలు చేసిన విచిత్ర...నన్ను రూంకు రమ్మనడమే కాకుండా సెట్ లో నాపై చెయ్ చేసుకున్నాడు...విచిత్ర.NTV.👇 pic.twitter.com/QSwCvW2GI8
ఆ సమయంలో హీరో నుంచి కాపాడిన వ్యక్తినే తాను పెళ్లి చేసుకున్నానని..ఇప్పుడు తనకు ముగ్గురు అందమైన పిల్లలు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఆమె ఆరోపణలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ మీదనే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నటి విచిత్ర తెలుగు ఒక్క సినిమాలో నటించిందని..అది బాలకృష్ణ హీరోగా నటించిన 'భలేవాడివి బాసూ'సినిమాను గుర్తు చేస్తున్నారు.

2001లో వచ్చిన ఈ సినిమా ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో నటి విచిత్ర అడవి తెగ అమ్మాయి పాత్రలో నటించింది. ఈ సినిమా సెట్స్‌లోనే బాలకృష్ణ తనపై వేధింపులు పాల్పడినట్లు ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గతంలో కూడా బాలకృష్ణ మీద ఇలాంటి ఆరోపణలే వినిపించాయి.

బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సౌత్‌లో ఓ సీనియర్ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించారని..నీ వెనుక భాగం నొప్పిగా ఉంటే చెప్పు..వచ్చి సాయం చేస్తానని చెప్పడంతో..తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని.. వెంటనే గుడ్ నైట్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయానని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.ఆ సమయంలో ఆమె బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించింది. దాంతో అప్పుడూ కూడా ఆ హీరో బాలకృష్ణనే అని అంతా అనుకున్నారు.
అయితే ఈ ఘటన తరువాత కూడా రాధిక ఆప్టే బాలకృష్ణతో లయన్ సినిమాలో మరోసారి నటించింది. ఈ ఇద్దరూ హీరోయిన్లు ఎక్కడా కూడా బాలకృష్ణ పేరు చెప్పింది లేదు. కాని ఆయన పేరే తెర మీదకు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. ఏపీలో మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే ఆయన వ్యతిరేకవర్గం బాలకృష్ణ పేరును ఇందులోకి లాగుతున్నారని ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలకృష్ణ నోరు విప్పితే తప్ప..ఇలాంటి రూమర్స్‌కు చెక్ పడే అవకాశం లేదు.
-
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications