మెగా ఫ్యామిలీపై బాలకృష్ణ సెటైర్లు..? ఆ సంస్కారం నాకు లేదంటూ

ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసిపోయాయి కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్యపోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు...అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటరిచ్చారు.

Hero Balakrishna s reaction on fake collections

బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లే వారు అలగాజనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ నటించి 'డాకు మహారాజ్', రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో 'డాకు మహారాజ్' హిట్‌గా నిలవగా, 'గేమ్ ఛేంజర్' సినిమా ఫ్లాప్ అయింది. అయితే 'గేమ్ ఛేంజర్' తొలి రోజు కలెక్షన్లపై పెద్ద రగడ జరిగింది.

మూవీ మేకర్స్ సినిమా ఏకంగా రూ.186 కోట్లు వసుళ్లు చేసినట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ వాస్తవానికి ఈ సినిమా మొదటి రోజు రూ. 51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు ట్రెడ్ పండితులు చెబుతున్నారు.ట్రాకర్స్ మరియు మేకర్స్ మధ్య ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు వచ్చిందనే అనేది ఎవరికి అర్థం కావడం లేదు. తాజాగా దీనిపై బాలకృష్ణ తనదైనశైలిలో స్పందించారు. 'డాకు మహారాజ్' సక్సెస్ తర్వాత ఇచ్చిన ఇంటర్య్వూలో బాలకృష్ణ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడారు.

తొలి నుంచి నా సినిమాల రికార్డులు, రివార్డులు, నా అవార్డులు జెన్యూన్‌గా ఉంటాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. గోరంతను కొండంతగా చూపించే సంస్కారం నాకు లేదని ఆయన తెలిపారు. నా రికార్డులు, రివార్డులు అన్నీ అన్‌స్టాపబుల్ అని .. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ 'గేమ్ ఛేంజర్' ఫేక్ కలెక్షన్స్‌ గురించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఫేక్ కలెక్షన్స్‌ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+