చంద్రబాబుకు షాక్.. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఆ పార్టీకేనా?

ఏపీలో అసెంబ్లీకి, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో ఏపీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదలవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కూటమికి మధ్య పోరు హోరాహోరీగా జరుగుతోంది. తెలుగు సినీ రంగానికి చెందినవారంతా ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు.

నందమూరి కుటుంబానికి చెందినవారంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే ఇందులో దివంగత హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తున్నాడనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ తారక్ ను దూరం పెట్టిందని, దీంతో అతను కూడా మౌనంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉన్నాడంటూ ప్రచారం చేసుకున్నారంటున్నారు.

hero junior ntr support for which party in ap elections

ఎన్టీఆర్ పేరుతో టీడీపీ, వైసీపీ ఎప్పటినుంచో కొట్లాడుకుంటున్నాయికానీ తారక్ మాత్రం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ కు విభేదాలు కొనసాగుతున్నాయని, దీంతో చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా స్పందించలేదని, అతని సోదరుడు కల్యాణ్ రామ్ కూడా తారక్ కు మద్దతుగానే ఉన్నాడనే విషయం తెలిసిందే.

వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటివారు మాత్రం తారక్ కు మద్దతుగా వారు అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారనే విషయాన్ని తరుచుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు, బాలయ్య, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. అయితే ఇదంతా వాస్తవం కాదు లేదంటే వాస్తవమే అనే విషయాన్ని మాత్రం తారక్ చెప్పలేదు. కొడాలి వ్యాఖ్యలను కూడా ఖండించేవాడు కాదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తారక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్లెక్సీల్లో గతంలో ఎన్టీఆర్ ఫొటోలు కూడా ఉండేవి.

ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో ఎక్కడా తారక్ ఫొటోలను టీడీపీ శ్రేణులు ఉపయోగించడంలేదు. కొడాలి, వంశీలాంటివారికి మద్దతుగా నిలవడంద్వారా పరోక్షంగా అతను వైసీపీకే మద్దతుదారుగా ఉన్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తారక్ తమపార్టీకే మద్దతిస్తున్నాడని వైసీపీవారు ప్రకటిస్తున్నారు. అయితే ఎవరికి మద్దతు అనే విషయాన్ని మాత్రం తారక్ బహిరంగంగా చెప్పకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. తారక్ వ్యవహార సరళి చూసినవారికి మాత్రం అతను పరోక్షంగా వైసీపీకే మద్దతని చెప్పొచ్చంటున్నారు. తారక్ మనసులో ఏముందో అతనికే తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+