ఎన్నికల సమయంలో హీరో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో నాగార్జున తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడంలో మంత్రి కేటీఆర్ సక్సెస్ అయ్యారని ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపడంలో కేటీఆర్ పాత్ర ఎంతో ఉందని నాగార్జున చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్ నగరాన్నే ఎంచుకుంటున్నాయని నాగార్జున అన్నారు.
పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ మారేలా కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌ను నాగార్జున అభినందించారు. అత్యాధునిక వసతులతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సంస్థలను ఆకర్షిస్తోందని నాగార్జున వివరించారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు హీరో నాగార్జున ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పరొక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

నాగార్జున వ్యాఖ్యలు కచ్చింతంగా అధికార బీఆర్ఎస్ పార్టీ లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్‌పై నాగార్జున ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో పూర్తిగా నిమగ్నమైయ్యాయి. అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications