షూటింగ్ లో హీరో నానికి ప్రమాదం.. తల పగిలి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ క్రైమ్ త్రిల్లర్ హిట్-3 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నాని సరికొత్తగా ఊర మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ రికార్డుల వేట కొనసాగిస్తోంది. హీరో నానికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా హిట్- 3 నిలిచింది. మూడు రోజుల్లో 82 కోట్లు గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. రూ. 100 కోట్ల దిశగా ఈ మూవీ దూసుకెళ్తోంది.

ఈ సినిమాలో మొదటిసారి నాని.. తన విశ్వరూపం చూపించాడు. దసరా సినిమాలో మాస్ పాత్రలో నటించాడు. ఈ సారి మాత్రం మాస్ తో పాటు వైలెంట్ పోలీస్ గా తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ జనాలు మాత్రం ఫ్యామిలీతో కలిసి థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు.

Hero Nani Injured on Set of Hit 3 Suffers Head Fracture

ఇక ఈ సినిమా కోసం నాని బాగా కష్టపడినట్లు స్కీన్ పై ఆయన నటన చూస్తే తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ డాక్టర్. శైలేష్ కొలను.. నాని పనితనం గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. 'జమ్ముకశ్మీర్ శ్రీనగర్ లో ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరా నాని తలకు తగిలి చీలి రక్తం కారింది. కానీ నాని మాత్రం షూటింగ్ స్టాప్ చేయలేదు. రక్తం గడ్డ కట్టేలా చేసి షూటింగ్ పూర్తిచేశాడు. షూట్ అవ్వగానే ఢిల్లీకి నైట్ వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకొని ఉదయాన్నే.. శ్రీనగర్ వచ్చి అక్కడినుంచి షూటింగ్ స్పాట్ కు వచ్చాడు. నాని పనితనం అలా ఉంటుంది' అని చెప్పుుకొచ్చాడు.

ఈ సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడని హిట్-3 చిత్రం డైరెక్టర్ డాక్టర్. శైలేష్ కొలను తెలిపాడు. తాజాగా నానికి గాయం ఘటనను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు శైలేష్ కొలను. షూటింగ్ లో నాని గాయపడ్డ ఫొటోలు, వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం గౌరవం నాని కే దక్కాలి. సినిమాపై మీకున్న ప్రేమ చాలా విలువైనది. అని పోస్ట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+