hi nanna review: హాయ్ నాన్న రివ్యూ.. హృదయాలను హత్తుకున్నాడా?

చిత్రం: హాయ్‌ నాన్న;
నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు;
సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌;
నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల,
రచన, దర్శకత్వం: శౌర్యువ్;
సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌;

దసరా సినిమాతో మాస్ అవతారాన్ని చూపించిన నాన్ని ఆ తర్వాత పూర్తి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుండే నాని(Nani) శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో'హాయ్ నాన్న' (Hi Nanna) చేశారు. విడుద‌ల‌కి ముందే నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. (Hi Nanna review in telugu).

hero nani latest movie hi nanna review

కథ : విరాజ్ (నాని) ఒక సక్సెస్ ఫుల్ ఫోటోగ్రాగర్. ముంబైలో ఒక స్టూడియో రన్ చేస్తూ తన ఒక్కగానొక్క కూతురు మహి (కియారా ఖన్నా), తండ్రి లాంటి వ్యక్తి (జయరాం)తో కలిసి చాలా సంతోషంగా జీవిస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది యష్న (మృణాల్ ఠాకూర్). విరాజ్ తన కూతురుతో నిర్మించుకున్న కలల ప్రపంచంలోకి వచ్చిన యష్న ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చివరికి ఏం జరిగింది? అనేది "హాయ్ నాన్న" కథాంశం.

ఎలా ఉందంటే : ఇందులోని ప్రేమ‌క‌థ‌లో మ‌లుపులు కొత్త‌గా ఉంటాయి. భావోద్వేగాలు హృద‌యాన్ని బలంగా హత్తుకుంటాయి. చిన్నారి త‌న అమ్మ‌గా క‌థానాయిక‌ని ఊహించుకోవ‌డం మొద‌లైన‌ప్ప‌టి నుంచే ఈ క‌థ ఏ దిశ‌గా సాగుతుందో ప్రేక్ష‌కుడు ఓ అంచ‌నాకి వ‌స్తాడు. అయినా స‌న్నివేశాలు ఓ ప్రేమ‌క‌థ‌కి కావ‌ల్సిన సంఘ‌ర్ష‌ణ‌ని పండిస్తాయి. భావోద్వేగాలు, మలుపులు సినిమాను మరోస్థాయిలో నిలబెడతాయి. ఆవిష్కరించిన ప్రేమలోనే కాస్తంత బలం తగ్గింది. వ‌ర్ష క‌థ విని య‌ష్న విరాజ్‌తో ప్రేమ‌లో ప‌డటం, ఆ త‌ర్వాత మ‌హి ఎవ‌రి కూతురు అనే మ‌లుపు సినిమాని ఆస‌క్తిక‌రంగా మార్చాయి. ద్వితీయార్ధంలో పండే భావోద్వేగాల‌తో మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు క‌థ‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు.

తండ్రీ కూతుళ్ల పాత్ర‌లు ఆ ఇద్దరి నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. ఊహ‌కు అందే క‌థ‌, అక్క‌డ‌క్క‌డా నిదానంగా సాగే స‌న్నివేశాలున్నా కుటుంబ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డే ఈ త‌ర‌హా భావోద్వేగాల‌తో సినిమాలు ఈమ‌ధ్య కాలంలో రాలేదు. ప్రేక్ష‌కులకి వినోదం పంచ‌డంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ సాధించింది.

ఎవ‌రెలా చేశారంటే : నాని మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆకట్టుకోవడమేకాదు.. హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి నాని పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించారు. (Hi Nanna review in telugu) ప్రేమ స‌న్నివేశాల్లోనూ, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ త‌న నటనతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ, కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కథకి త‌గ్గ మంచి స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. శౌర్యువ్‌కి ఇదే తొలి సినిమా అయినప్పటికీ ఎంతో స్ప‌ష్ట‌త‌తో, ప‌రిణ‌తితో సినిమాని తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. క‌థ‌లోని భావోద్వేగాలు, మ‌లుపులు, నాని, మృణాల్‌, బేబి కియారా న‌ట‌న, సంగీతం, విజువ‌ల్స్‌ ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయని చెప్పవచ్చు. చివరగా హాయ్ నాన్న ప్రేక్షకుల హృదయాలను బలంగా హత్తుకుంటాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+