ప్రభాస్‌ను చూశారా..? ఏమున్నాడ్రా బాబూ!

పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. ఆరడగులకు పైగా ఉండే కటౌట్ చూసి ఎవరైనా ఇట్టే మూర్ఛపోతారు. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా తమిళం, కన్నడం, మళయాళం, హిందీలో కూడా కటౌట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ మొదటిస్థానంలో ఉంటారు. బాహుబలి సినిమాకు ముందు చేసిన మిర్చి సినిమాలో ఎంత అందంగా కనపడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న గ్లామర్ తో అమ్మాయిల మనసును దోచేశాడు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మాత్రం ప్రభాస్ కనపడిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కష్టపడి గ్లామర్ గా మారాడు
ఆరడుగుల అందగాడు ఏమిటి అలా ఉన్నాడు?.. ముఖంలో కళ ఏది? అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ గ్లామర్ పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాడు. కష్టపడి గ్లామర్ గా మారాడు. సలార్ లో బాగున్నాడుకానీ సూపర్ అనిపించుకోలేకపోయాడు. కల్కిలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన తర్వాత అందరూ ప్రభాస్ ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నారు.

hero prabhas fans very happy due to his new look

అందరి కళ్లు ప్రభాస్ పైనే
తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వచ్చినవారంతా ప్రభాస్ ను చూసి ఫిదా అయ్యారు. ఇటీవలి కాలంలో ఇంత అందంగా ప్రభాస్ ఎప్పుడూ కనపడలేదు. మేకప్ వేసుకొని చాలామంది అందంగా కనపడటానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే చాలా సింపుల్ మేకప్ తో ఎంతో అందంగా ఉన్నాడు డార్లింగ్. దీంతో అందరూ ప్రభాస్ ఏమున్నాడ్రా బాబూ అంటూ మాట్లాడుకున్నారు. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా హీరోయిన్ గా ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+