ప్రభాస్ సంచలన నిర్ణయం...సినిమాలకు గుడ్ బై..? ఆరోగ్య కారణంగానేనా..?
రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన మరి కొద్దిరోజుల్లో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..'సలార్' హిట్ కావడంతో రెబల్ స్టార్ అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్‌కు మళ్లీ అంతటి రేంజ్ హిట్ పడలేదు.
సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. ఈ సమయంలోనే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సినిమా ప్రకటించినప్పటి దగ్గర నుంచి 'సలార్' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచానలకు తగినట్టుగానే 'సలార్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 'సలార్' మూవీ ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

ఇదింతా బాగానే ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ప్రభాస్ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కారణంగానే 'సలార్' సినిమా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సింది, డిసెంబర్‌లో విడుదలైందని అంటున్నారు. ఇక 'సలార్'లో చూపించినంత ఫిట్‌గా ప్రభాస్ బయట లేడనే విషయం అందరికీ స్పష్టం అవుతుంది. ప్రభాస్ ఆరోగ్య కారణంగానే కల్కి సినిమా కూడా ఆలస్యం అవుతుందనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి

తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే..మరో నాలుగైదు సినిమాలు చేసి ప్రభాస్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. ఆరోగ్యం బాలేకపోవడంతో రిస్కీ సీన్లు, హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాలు చేస్తే ప్రమాదమనే సినిమాలకు దూరం అవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. ఆరోగ్య కారణంగానే ప్రభాస్ సినిమాలకు దూరం అవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే సినిమాలకు ప్రభాస్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్‌కు ఆరోగ్యం బాలేదని వస్తోన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
-
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications