సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని నెట్టేసిన హీరో రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా సెల్ఫీ కోసం తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని నెట్టివేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.తెలుగు రాజకీయాలలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ మొదలగు వారు హాజరైయ్యారు.

Hero Ram Charan pushed the person who came for selfie

ఇక పవన్ కల్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. రామ్ చరణ్ సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని రామ్ చరణ్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే రామ్ చరణ్ అతన్ని తన చేత్తో పక్కకి నెట్టేశాడు. మరోవ్యక్తి కూడా రామ్ చరణ్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు..అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+