రామ్ చరణ్ ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..? ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ , అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ కొట్టి స్టామినా చూపించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు.అయితే భారీ ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా అభిమానులను నిరాశ పరిచింది.

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పెద్ది ( Peddi) అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. టైటిల్ పోస్టర్లో రామ్ చరణ్ ఊర మాస్ యాంగిల్‌లో కనిపించాడు.బీడీ కాల్చుతూ దర్శనం ఇచ్చాడు. రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Hero Ram Charan s assets details

ఇదిలా ఉంటే మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్‌ ఆస్తులు కూడా గట్టిగానే వెనుక వేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 70 కోట్ల నుండి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.రామ్ చరణ్ ఒక్కో ప్రకటనకు 2 నుండి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి రామ్ చరణ్ నిర్మాతగా మారారు.రామ్ చరణ్ ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థను కలిగి ఉన్నారు.

రామ్ చరణ్ దగ్గర మెర్సిడెస్ మేబాచ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ కి ఒక పెద్ద బంగ్లా ఉంది. దీని విలువ 40 నుండి 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ 1370 కోట్ల పైనే ఉంటుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+