యూట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తున్న రామ్.. దేశంలో ఏకైక హీరో

ఉత్తర భారతీయులు దక్షిణ భారతదేశం నుంచి అందులోను ప్రధానంగా తెలుగు నుంచి వచ్చిన సినిమాలను చూడకుండా రోజు గడపడంలేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా నుంచి ఉత్తర భారతీయులు తెలుగు సినిమాల హీరోలకు, దర్శకుల సినిమాలకు పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. తెలుగులో ఏ హీరో సినిమా ఎక్కడ ఉంది? ఏ ఓటీటీల్లో ఏ సినిమాలు ఉన్నాయి? వెతికి మరీ చూస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న ఉత్తరాది యువత అయితే తెలుగు నేర్చుకొని మరీ తెలుగులోనే సినిమాలు చూస్తామని చెబుతున్నారు.

సంచలన రికార్డు రామ్ సొంతం
కొంతకాలం క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించి జయజానకి నాయక సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో 700 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలన రికార్డును కైవసం చేసుకుంది. తాజాగా ఈ కేటగిరిలో యంగ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దేశంలో ఏ హీరోకు సాధ్యంకాని విధంగా సంచలన రికార్డును సృష్టించారు. రామ్ నటించిన తొమ్మిది సినిమాలు 100 మిలియన్ల వ్యూస్ ను దాటాయి. ఇటీవలి కాలంలో వారియర్, స్కంద చిత్రాల ద్వారా హిట్ దక్కనప్పటికీ డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో మరో హిట్ కొట్టడానికి రామ్ ప్రయత్నిస్తున్నాడు. గత చిత్రాలైన స్కంద రూ.40 కోట్ల నష్టాలు తేగా, వారియర్ సినిమా రూ.30 కోట్ల నష్టాలను తెచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్ సినిమాలు రికార్డులను సృష్టించడం ఒక్కటే అతనికి ఊరటనిస్తోంది.

hero ram pothineni hindi version movies creates new records in youtube

థియేటర్ లో పోయినా టీవీల్లో హిట్
స్కంద సినిమా థియేటర్ లో ఫ్లాప్ అయినప్పటికీ టీవీతోపాటు యూట్యూబలో విపరీతమైన స్పందన తెచ్చుకుంది. 8.11 టీవీ రేటింగ్ ను స్కంద చిత్రం తెచ్చుకుంది. నెలరోజుల క్రితం హిందీ వెర్షన్ సినిమాను యూట్యూబ్ లో విడుదల చేయగా ఈ 30 రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఈ చిత్రానికి 1.1 మిలియన్ల లైక్స్ రావడం అందరినీ నివ్వెరపరిచింది. యూట్యూబ్ లో రామ్ సినిమా 100 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడం తొమ్మిదోసారి. గత సినిమాలు కందిరీగ, రామరామ కృష్ణ కృష్ణ, ఉన్నది ఒక్కటే జిందగీ, పండగ చేస్కో, హలో గురూ ప్రేమ కోసమే, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్, ది వారియర్ హిందీ వెర్షన్ సినిమాలు 100 మిలియన్ల వ్యూస్ ను సాధించాయి. హలో గురూ ప్రేమ కోసమే సినిమా 600 మిలియన్ల వ్యూస్ ను అధిగమించబోతుండగా నేను శైలజ సినిమా మాత్రం 600 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. వారియర్ సినిమా అయితే 300 మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకుంది. యూట్యూబ్ లో ఇతర తెలుగు స్టార్ హీరోలకన్నా నెంబర్ వన్ స్థానంలో రామ్ పోతినేని నిలిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+