రవితేజ - సమంత మధ్య కోల్డ్‌వార్?
హీరో రవితేజ, హీరోయిన సమంత మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా? ఎందుకు వీరిద్దరికీ పడటంలేదు? కారణం ఏమైవుంటుంది? మీకేమైనా తెలుసా? వారిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అంటూ తెలుగు సినీ పరిశ్రమలోని ముఖ్యులంతా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఈ వార్త వైరల్‌గా మారింది. వాస్తవానికి వీరిద్దరినీ అజాత శత్రువులని చెప్పొచ్చు. సమంత అయితే తనదగ్గర పనిచేసేవారికి తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. రవితేజ ఎంతో నిబద్ధతగా సినిమాలు చేస్తాడు. ఎవరితోను గొడవ పెట్టుకోడు. తన పనేదే తాను చేసుకుపోతుంటాడు.
దర్శకునికి కూడా తెలియదు..
కొన్నాళ్ల క్రితం గోపీచంద్ మలినేని అనే దర్శకుడు రవితేజ, శ్రుతిహాసన్ తో బలుపు సినిమా తీశాడు. గోపీచంద్ రవితేజతో మూడు సినిమాలు తీయడంతోపాటు బాలయ్యతో ఇటీవలే వీరసింహారెడ్డి అనే సినిమాను కూడా చేశాడు. బలుపు సినిమా చేసే సమయంలో శ్రుతిహాసన్ కు బదులుగా ముందు సమంతను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే సమంత హీరోయిన్ గా అయితే నటించను అని రవితేజ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏమిటనేది దర్శకునికి కూడా రవితేజ చెప్పలేదు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు..
అయితే రవితేజకన్నా ముందే కథను విన్న సమంత హీరో రవితేజ అని తెలిసిన తర్వాత సినిమాను అంగీకరించలేదని తెలుస్తోంది. వీరిద్దరూ ఎందుకు ఒకరిపక్క మరొకరు నటించకూడదని నిర్ణయం తీసుకున్నారో దర్శకుడికి కూడా తెలియదన్నారు. బలుపు సినిమా తర్వాత కూడా ఏ సినిమాలోను వీరు కలిసి నటించలేదు. అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. తెలియని కోల్డ్ వార్ ఏదో వీరిద్దరి మధ్య నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఒక వెబ్ సిరీస్ తోపాటు ఒక సినిమా చేస్తోంది. అది సొంత బ్యానర్ పై నిర్మాణమవుతోంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందంటున్నారుకానీ అధికారికంగా ఇంకా ధ్రువీకరణ రాలేదు.












Click it and Unblock the Notifications