భార్య కోసం మాట తప్పితే నాపేరు మార్చుకుంటా.. స్టార్ హీరో ఓపెన్ చాలెంజ్.. నేను దేనికైనా రెఢీ !
కర్ణాటక రాజాపులి, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కంచుకోట అయిన శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం లోక్ సభ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీతా శివరాజ్‌కుమార్ బరిలో ఉండగా, అదే నియోజక వర్గం నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్ర బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
గీతా శివరాజ్ కుమార్ సోదరుడు, కర్ణాటక మంత్రి అయిన మధు బంగారప్ప శక్తి వంచన లేకుండా తన సోదరిని శివమొగ్గ ఎంపీగా గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి గీతా శివరాజ్ కుమార్ భర్త, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ సైతం అన్ని సినిమా షూటింగ్ లు పక్కనపెట్టి శివమొగ్గలో మకాం వేసి ఆయన భార్యను గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తీరికలేకుండా హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా ను గెలిపించాలని శివమొగ్గ జిల్లాలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ తన సతీమణి గీతా శివరాజ్ కుమార్ తరపున శివమొగ్గలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గీతా శివరాజ్ కుమార్ కు శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గం టికెట్ ప్రకటించిన రోజు నుండి తన భార్య తరపున నిరంతర ప్రచారంలో నిమగ్నమైన శివరాజ్ కుమార్ ప్రతి ఇంటిలోని ఓటర్లను కలుస్తున్నారు. హీరో శివరాజ్‌కుమార్ శివమొగ్గలో మాట్లాడుతూ తన భార్య గీతాను గెలిపిస్తే ప్రజల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు.
తన భార్య గీతాను గెలిపించుకోవాలని ఆమె భర్తగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నానని, తన భార్యకు ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకుంటామని, ప్రజల కోసం పని చేస్తామని, ప్రజలతో జీవించాలని తన భార్య గీతా అనుకుంటున్నదని, ఆమె తండ్రి, మాజీ సీఎం బంగారప్ప అడుగుజాడల్లో ఆమె నడవాలని అనుకుంటున్నారని కన్నడ హీరో శివరాజ్ కుమార్ అన్నారు.
తన భార్య గీతా ఇప్పటికే ట్రస్టు పేరుతో ప్రజా సేవ చేస్తున్నారని, ఎంపీగా అధికారం వస్తే ఇంకా ఎక్కువగా సేవ చేసే అవకాశం వస్తుందని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. తన భార్య గీతా కుటుంబ సభ్యులకు చాలా సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, ఆమె రాజకీయ కుటుంబంలో పుట్టిపెరిగిందని, ఆమెకు తనకంటే ఎక్కువ రాజకీయ అభనువం ఉందని హీరో శివరాజ్ కుమార్ అన్నారు.

తన భార్య గీతా శివరాజ్ కుమార్ ను ఎంపీగా గెలిపిస్తే ఆమె బెంగళూరు వెళ్లిపోతారని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గీతా ఎంపీగా విజయం సాదించిన తరువాత శివమొగ్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తారని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. అయితే తన భార్య ఎంపీగా విజయం సాధించిన తరువాత చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే తన పేరు మార్చుకుంటానని హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇచ్చిన ప్రతిహామీ నేరవేర్చాలా తన భార్య గీతా శివరాజ్ కుమార్ కష్టపడి పని చేస్తారని, అందులో ఎలాంటి అనుమానం వద్దని శివమొగ్గ ప్రజలకు హీరో శివరాజ్ కుమార్ హామీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. హీరో శివరాజ్ కుమార్ అభిమానులతో పాటు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమానులు గీతా శివరాజ్ కుమార్ కు మద్దతుగా ఆమెను గెలిపించాలని శివమొగ్గ జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications